ప్రముఖ నటుడు, దర్శకుడు, నటనా శిక్షణ ఇచ్చే దేవదాస్ కనకాల తుది శ్వాస విడిచారు. దేవదాస్ కనకాల అంటే కేవలం రాజీవ్ కనకాల తండ్రిగానో.. యాంకర్ సుమ మామగానో గుర్తుపట్టొచ్చు. కాని దేవదాస్ కనకాల పేరు చెప్పుకునే వీళ్లు ఫేమస్ అయ్యారన్న విషయం ఎవరికి తెలియదు.


చదువుకునే రోజుల్లోనే నటన మీద ఆసక్తి చూపించిన దేవదాస్ కనకాల పూణె ఫిల్మ్ ఇన్ స్ట్యూట్ లో మొదటి బ్యాచ్ లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నారు. అయితే తాను నటించడం కన్నా నటనలో శిక్షణ ఇస్తే బెటర్ అనుకున్న దేవదాస్ కనకాల ఎంతోమంది నటీనటులకు నటనలో శిక్షణ ఇచ్చారు. సౌత్ సూపర్ స్టార్స్ రజినికాంత్, చిరంజీవి వంటి ఎంతోమంది స్టార్స్ కు దేవదాస్ కనకాల నటనలో శిక్షణ ఇచ్చారు.  


1971 నవంబర్ 21న దేవదాస్ కనకాల లక్ష్మిదేవిని పెళ్లి చేసుకున్నారు. దేవదాస్ కనకాల అప్పట్లోనే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తన కన్నా ఆరేళ్లు పెద్దదైన లక్ష్మి దేవిని ప్రేమించి పెళ్లాడారు దేవదాస్ కనకాల. అందుకే దేవదాస్ కనకాల తనయుడు రాజీవ్ కనకాల లవ్ మ్యారేజ్ కు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.


దేవదాస్ కనకాల తీసిన ఓ సీరియల్ లో సుమని చూసి ఈమె తన కోడలు అయితే బాగుంటుందని అనుకున్నారట. ఆ తర్వాత రాజీవ్, సుమల ప్రేమ వ్యవహారం తెలిసి వారి పెళ్లికి ఒప్పుకున్నారట. ప్రేమ విలువ తెలుసు కాబట్టే.. తనది ప్రేమ వివాహం కాబట్టే రాజీవ్, సుమల ప్రేమ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దేవదాస్ కనకాల. ఆయన మరణ వార్త తెలుగు పరిశ్రమని దిగ్బ్రాంతికి గురి చేస్తుంది. ఎంతోమంది స్టార్స్ ను నటనలో శిక్షణ ఇచ్చిన దేవదాస్ కనకాల భౌతికంగా దూరమైన ప్రేక్షక హృదయాల్లో ఎప్పటికి నిలిచి ఉంటారని చెప్పొచ్చు.      



మరింత సమాచారం తెలుసుకోండి: