ఎందరో నటీనటులకు తమ యాక్టింగ్ స్కూల్ ద్వారా శిక్షణనిచ్చి తీర్చిద్దిన మహోన్నత వ్యక్తి దేవదాస్ కనకాల గారు, నేడు కొన్ని అనారోగ్య కారణాల వలన హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో హఠాన్మరణం పొందారు. ఇటీవల ఈటివి ఛానల్ లోని అలీతో సరదాగా అనే కార్యక్రమంలో ఎంతో చలాకీగా ఆయన పాల్గొని షోలో నవ్వులు పూయించారు. ఇకపోతే దేవదాస్ కనకాల గారు అలానే ఆయన సతీమణి లక్ష్మి కనకాల గారు ఇద్దరూ కలిసి కొన్నేళ్ల క్రితం స్వయంగా నటులకు శిక్షణ నిచ్చే ఒక స్కూల్ ని నెలకొల్పి, ఇప్పటివరకు ఎందరో నటీనటులకు శిక్షణ నివ్వడం జరిగింది. తన కాలేజీ చదువుల అనంతరం పూణే లోని ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటనలో దేవదాస్ కనకాల గారు శిక్షణ పొందారు, ఇక అదే సమయంలో అక్కడనే శిక్షణ తీసుకుంటున్న లక్ష్మి గారిని చూసి, ప్రేమించి ఆవిడను వివాహమాడారు.   

ఇకపోతే ఇటీవల దేవదాస్ కనకాల గారి భార్య లక్ష్మి గారు అకాల మరణం పొందడంతో ఆయన కొంత మానసికంగా కృంగిపోయినట్లు సమాచారం. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల మరియు యాంకర్ సుమ కనకాల ఆయనకు కొడుకు, కోడలు అనే విషయం తెలిసిందే. నేడు ఆయన మృతితో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. అయితే దేవదాస్ కనకాల మరియు లక్ష్మి గార్లకు నటనా శిక్షకులుగా టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉందని అంటున్నారు సినిమా విశ్లేషకులు. అదేమిటంటే, వారిద్దరూ కలిసి తమ యాక్టింగ్ స్కూల్ ద్వారా శిక్షణ ఇచ్చిన వారిలో ఎక్కువమంది నటులు, ప్రస్తుతం టాప్ స్టార్స్ గా వెలుగొందుతున్నారని, ఆ విధంగా వారిద్దరికీ చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రత్యేక గుర్తింపు ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. 

ఇక టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుండి మెగాస్టార్ చిరంజీవి, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, యాక్షన్ హీరో భాను చందర్, కమెడియన్ శుభలేఖ సుధాకర్ వంటివారు, అలానే కోలీవుడ్ సినిమా పరిశ్రమ నుండి సూపర్ స్టార్ రజినీకాంత్, అరుణ్ పాండ్యన్, రాంకీ, రఘువరన్, నాజర్ వంటి దిగ్గజ నటులు, దేవదాస్ కనకాల దంపతుల వద్ద నటనలో శిక్షణ తీసుకున్నవారే. ఇక రేపు జరిగే దేవదాస్ కనకాల గారి అంతిమ యాత్రలో పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సినిమా రంగ ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం....!!


మరింత సమాచారం తెలుసుకోండి: