మెగాస్టార్ పుట్టిన రోజు అంటే అభిమానులు పండుగ రోజుగా భావిస్తారు. ఆగస్ట్ నెల వచ్చిందంటే చాలు ఫ్యాన్స్ కి ఎక్కడలేని పూనకం వస్తుంది. ఇదే నెలలో దేశ మాత దాస్య శ్రుంఖలాలు తెగి స్వేచ్చా వాయువులు పీల్చిన స్వాతంత్ర దినోత్సవం కూడా  ఉంది. దానికి సరిగ్గా మరో వారంలో అంటే ఆగస్ట్ 22న   మెగా ఫ్యాన్స్ కి కొత్త స్వేచ్చను ఇచ్చేదిగా చిరంజీవి బర్త్ డే ఉంది. ప్రతీ సారి ఫ్యాన్స్ మధ్యన  బర్త్ డే చేసుకునే మెగాస్టార్ ఈసారి పుట్టిన రోజు వేడుకలు మాత్రం సంచలనాన్ని నమోదు చేస్తాయి అంటున్నారు.


ఈసారి చిరు బర్త్ డే వేడుకల్లో ముఖ్య అథిధిగా బీజేపీకి చెందిన ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజు హాజరవుతారని అంటున్నారు. నిజానికి చిరంజీవికి రాజకీయాలకు బహు దూరం అంటారంతా. ఆయన ప్రజారాజ్యం పెట్టడం, కాంగ్రెస్ లో దాన్ని విలీనం చేయడం గత  చరిత్ర. అంతే ఆ తరువాత చిరంజీవి పూర్తిగా పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నారు. ఆయన మళ్ళీ సినిమా రంగంలోకి వచ్చి రీ ఎంట్రీతోనే పెద్ద హిట్ కొట్టాడు.


ఇపుడు సైరా మూవీ షూటింగ్ పూర్తి అయింది అక్టోబర్ నుంచి కొరటాల సివ మూవీ ఉంది ఈ బిజీ షెడ్యూల్ లో చిరంజీవి రాజకీయాలు అంటే నో అనేస్తున్న మాట అందరికీ తెలిసిందే. అయితే చిరంజీవిని రాజకీయాల్లోకి రమ్మని బీజేపీ పిలుస్తోందన్న మాట కూడా ప్రచారంలో ఉంది. మెగాస్టార్ అయితే ఏపీలో పార్టీకి కొత్త బలాన్ని ఇస్తాడని బీజేపీ పెద్దలు నమ్ముతున్నారు. మరి దానికి చిరంజీవి ఏమీ అనలేదని కూడా అంటారు. 


మరి ఇపుడు ఏకంగా బీజేపీ ఫైర్ బ్రాండ్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకు నిజంగా వస్తే మాత్రం అది సెన్సేషన్ అవుతుంది. ఈ వేదిక కూడా రాజకీయ వేదికగా మారిపోతుంది. మరి అది నిజమా, సోము వీర్రాజు చిరు ఫంక్షన్ ని వస్తున్నారా అన్నది ఇంకా తేలాల్సివుంది. అదే కనుక జరిగితే సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చినట్లుగా రాజకీయాల్లోనూ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: