‘సాహో’ మూవీకి సంబంధించిన రెండవ పాట ‘ఏ చోట నువ్వున్నా’ టోటల్ వీడియో సాంగ్ రిలీజ్ కావడంతో ఆ పాటను చూసి ప్రభాస్ అభిమానులు జోష్ లోకి వెళ్ళిపోతున్నారు. కళ్ళు చెదిరిపోయే ఆస్ట్రియా లొకేషన్స్ లో ప్రభాస్ శ్రద్ధా కపూర్ ల రొమాంటిక్ కెమిస్ట్రీ ఈ పాటకు హైలెట్ అంటూ పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.  

ఈ పాట విడుదలై ఒక్కరోజు పూర్తి కాకుండానే ఇప్పుడు ఈపాట పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ స్థాయి మించి ఉండటం షాకింగ్ గా మారింది. ఈ పాట ట్యూన్ ఏమంత ఒరిజనల్ గా లేదని హిందీ సినిమాలలోని పాత రొమాంటిక్ సాంగ్స్ ట్యూన్స్ లో ఈపాట ట్యూన్ ఉంది అంటూ విమర్శలు వస్తున్నాయి. 
ఇక ముఖ్యంగా ఈ పాటలో ప్రభాస్ లుక్స్ పై తీవ్ర స్థాయిలో సెటైర్లు పడుతున్నాయి. 

ప్రభాస్ హెయిర్ స్టైలింగ్ మేకప్ విషయంలో అంతా బాలీవుడ్ స్టైల్ ఫాలో అయ్యారని అందువల్ల ఆ తరహా లుక్ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అంతేకాదు మంచు ప్రదేశంలో తీసిన ఈ పాట చిత్రీకరణ సమయంలో అక్కడి చలికి ప్రభాస్ పెదవులు పగిలితే జెల్లి రాసారేమో కాని ప్రభాస్ పెదవులు ఈ పాటకు సరిపోయే విధంగా కదలిక లేకుండా కొన్ని చోట్ల ఆడ్ గా కనిపించిందని కామెంట్స్ వస్తున్నాయి. 

మరికొందరైతే ఈ పాట పై సెటైర్లు వేస్తూ ఈ పాటలో ప్రభాస్ ఒక చోట మంచు విష్ణులా ఇంకో చోట నితిన్‌లా మరో చోట సాయిధరమ్ తేజ్‌లా కనిపించాడంటూ స్క్రీన్ షాట్లు తీసి నెటిజన్లు సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడి ఒక స్థాయికి మించి ఉంది. దీనితో ‘సాహో’ గురించి నెగిటివ్ టాక్ ప్రచారం చేయడానికి ఎంతమంది ప్రభాస్ వ్యతిరేకులు సిద్ధంగా ఉన్నారో తెలుస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: