టాలీవుడ్లో హీరోగా ఆరేళ్ళ క్రిందట కెరీర్ స్టార్ట్ చేసాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆరేళ్ళలో బెల్లంకొండ శ్రీనివాస్ ఆరు సినిమాల్లో నటించినా ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. అల్లుడు శీను, జయ జానకి నాయక సినిమాలు హిట్ అని చెప్పుకున్నప్పటికీ అవి కూడా కాస్ట్ ఫెయిల్యూర్ అయ్యాయి. మాస్ సినిమాల్లో నటిస్తున్నా ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త కథలలో నటించాలని సీత సినిమాలో నటించాడు. 
 
సీత సినిమా కూడా బెల్లంకొండ శ్రీనివాస్ కు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. సీత సినిమా కూడా నిరాశ పరచటంతో తమిళంలో హిట్టైన 'రాట్చసన్ ' సినిమా రీమేక్ కథను నమ్ముకున్నాడు. రాట్చసన్ రీమేక్ రాక్షసుడు సినిమాలో హీరోగా నటించాడు బెల్లంకొండ శ్రీనివాస్. నిన్న విడుదలైన ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. కథ, కథనం అద్భుతంగా ఉండటం, బెల్లంకొండ శ్రీనివాస్ కూడా పాత్రకు తగినట్లుగా నటించటం సినిమాను హిట్ చేసాయి.  
 
మరో హీరో కార్తికేయ ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి RX 100 సినిమాతో హిట్ కొట్టాడు.కేవలం కోటిన్నర బడ్జెట్ తో తీసిన RX 100 సినిమా 13 కోట్ల రుపాయల వసూళ్ళు సాధించింది. కానీ RX 100 సినిమాతో వచ్చిన క్రేజ్ అంతా హిప్పీ సినిమాతో పోగొట్టుకున్నాడు కార్తికేయ.హిప్పీ ఫ్లాప్ అయినప్పటికీ నిన్న విడుదలైన గుణ 369 సినిమాతో హిట్ కొట్టాడు కార్తికేయ.

 

ఫ్లాపుల్లో ఉన్న ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలై ఇద్దరికీ హిట్లు రావటం విశేషం. ఇస్మార్ట్ శంకర్ విడుదలై ఇప్పటికే రెండు వారాలు కావటం, డియర్ కామ్రేడ్ సినిమాకు డివైడ్ టాక్ రావటం వలన ఈ రెండు సినిమాలకు పోటీనిచ్చే సినిమా ఏదీ లేదు. రెండు సినిమాలకు హిట్ టాక్ రావటంతో ఆగష్ట్ 9 వ తేదీన మన్మథుడు2 విడుదలయ్యేదాకా ఈ సినిమాలకు పోటీనిచ్చే సినిమా మరేదీ లేదు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: