విలక్షణ నటుడు దర్శకుడు నాటక రచయిత దేవదాస్ కనకాల నిన్న మరణించడంతో ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు అంతా ఆయన మరణానికి సంతాపం తెలియచేస్తున్నారు. ఆయన జీవించి ఉన్న రోజులలో చిరంజీవిని తన ఇంటికి రావద్దని చెపుతూ కోరిన ఒక ఆసక్తికర విషయాన్ని ఈరోజు ఒక ప్రముఖ దినపత్రిక ప్రచురించింది.

మెగా స్టార్ గా కోట్ల మంది అభిమానాన్ని పొందిన చిరంజీవి పూణే ఫిలిం ఇన్ స్టిట్యూట్ నుండి వచ్చిన తరువాత తన నటనలో మరింత మెళుకువులు నేర్చుకోవడానికి దేవదాస్ కనకాల శిష్యరికం చేసాడు. అప్పట్లో చిరంజీవి డైలాగ్స్ పలికే విషయంలో చాల ఇబ్బంది పడేవాడని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో దేవదాస్ చెప్పారు అంటే చిరంజీవిని మంచి నటుడుగా మార్చడంలో దేవదాస్ కనకాల కృషి ఎంత ఉందో అర్ధం అవుతుంది. 

ఆ తరువాత చిరంజీవి వరస విజయాలు అందుకుని టాప్ హీరో అయిన తరువాత ఒకరోజు తన గురువు దేవదాస్ ను కలవడానికి ప్రత్యేకంగా ఆయన ఇంటికి వచ్చాడట. చిరంజీవి దేవదాస్ ఇంటికి వచ్చిన విషయాన్ని తెలుసుకుని విపరీతంగా అభిమానులు వచ్చేయడంతో కనీసం చిరంజీవి దేవదాస్ తో ప్రశాంతంగా ఒక్క క్షణం కూడ మాట్లాడలేకపోయాడట. ఈ సంఘటనతో షాక్ అయిన దేవదాస్ కనకాల చిరంజీవి వైపు చూస్తూ ఎప్పుడు తన ఇంటికి రావద్దని అవసరం అనుకుంటే తానే చిరంజీవి ఇంటికి వస్తాను అని చెప్పాడట. 

దేవదాస్ కనకాల మరణంతో చిరంజీవిని రజినీకాంత్ ని రాజేంద్రప్రసాద్ ని ‘సార్’ అని కాకుండా ‘నువ్వు’ అని పిలవగలిగిన వ్యక్తి ఇక ఇండస్ట్రీలో ఎవరూ లేరు అంటూ ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. నటుడుగా దర్శకుడుగా సాధించిన విజయాలుకన్నా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి దాదాపు 60 మందికి పైగా దేవదాస్ కనకాల శిష్యులు ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అంటే నటనకు సంబంధించి ఒక గొప్ప గురువును టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ కోల్పోయింది అంటూ దేవదాస్ కనకాలకు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: