బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. అయితే ప్రభాస్ బాహుబలి లాంటి సంచలన మూవీ తరువాతి సినిమా పెద్ద డైరెక్టర్ దర్శకత్వంలో ఉంటుందని చాలా మంది ఊహించారు. కానీ అనూహ్యంగా కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న అది కూడా శర్వానంద్ తో రన్ రాజా రన్ సినిమా తీసిన దర్శకుడు సుజిత్ కి అవకాశం ఇస్తారని ఎవరు ఊహించలేదు. కానీ సుజిత్ మాత్రం ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం కొట్టేసారు. అయితే ఈ సినిమా డీల్ చేసే ముందు ఇంత పెద్ద సినిమాను, భారీ సిజిఎఫ్ వర్క్ ఉన్న మూవీని కనీసం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్ ఎలా డీల్ చేస్తారని అందరూ అనుకున్నారు.


కానీ అందరీ అనుమానాలను పటా పంచెలు చేస్తూ మేకింగ్ వీడియోతోనే తన మేకింగ్ ఎలా ఉండబోతుందో ప్రేక్షకులకు, తన సామర్థ్యం మీద నమ్మకం లేని వారికీ రుచి చూపించారు. అయితే లేటెస్ట్ గా సాహో సినిమా నుంచి కొత్త సాంగ్ ఒకటి రిలీజ్ అయ్యింది. ఆ పాటను ఆస్ట్రియాలో అద్భుత లొకేషన్ లో చిత్రీకరించారు. ఈ పాట లో ఉన్న గ్రాండ్ నెస్, హై క్వాలిటీ, అందులో పెట్టిన ఖర్చు ఆ సాంగ్ మేకింగ్ అవన్నీ చూసిన తరువాత మనకు శంకర్ గుర్తుకు రాక తప్పదు.


ఇప్పుడు ఇవన్నీ చూసిన తరువాత సుజిత్ టాలెంట్ ఏంటో అందరికి అర్ధమయ్యి ఉంటుంది. అయితే ఇదే విషయం మీద సుజిత్ మాట్లాడుతూ శంకర్ ఎక్కడ నేనెక్కడ .. వారెక్కరో పైన ఉన్నారు. వారితో నన్ను పోల్చొద్దని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ చాలా మంది సాంగ్ మేకింగ్ శంకర్ లా ఉందని ఫోన్ చేసి చెబుతున్నారని చెప్పుకుకొచ్చారు. అయితే ఒక్కో పాటను ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ తో  కంపోజ్ చేయించడానికి గల కారణమేంటి ? అని అడిగినప్పుడు అది ఎక్కడైనా సాధారణమే .. అన్నీ పాటలు ఒకేలా ఉండకూడదు అందుకే ఇలా చేశాము అని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: