రామ్ చరణ్, ఎన్టీయార్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. 2020 సంవత్సరం జులై 30 వ తేదీన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి జరుగుతున్న విషయాల పట్ల ఎన్టీయార్ ఫ్యాన్స్ హర్ట్ అయినట్లు తెలుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్లో మొదట రామ్ చరణ్ గాయపడ్డాడు తరువాత హీరో ఎన్టీయార్ కు కూడా గాయాలు అవ్వటంతో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కు కొంతకాలం బ్రేక్ ఇచ్చారు. 
 
కొంతకాలం బ్రేక్ తరువాత మరలా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రారంభమైంది. గత రెండు రోజుల నుండి ఎన్టీయార్ కు గాయాలయ్యాలని ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. కానీ ఆర్ ఆర్ ఆర్ సినిమా యూనిట్ మాత్రం ఈ వార్తలపై స్పందించటం లేదు. ఈ వార్తలపై యూనిట్ స్పందించకపోవటం, ఎన్టీయార్ కు హీరోయిన్ ఫైనల్ చేయకపోవటం పట్ల  ఎన్టీయార్ ఫ్యాన్స్ హర్ట్ అయినట్లు తెలుస్తుంది. 
 
ఎన్టీయార్ కు హీరోయిన్ గా మొదట హాలీవుడ్ కు చెందిన డైసీ ఎడ్గర్ జోన్స్ ను ఎంపిక చేసారు. కానీ ఆ తరువాత డైసీ ఈ సినిమా నుండి తప్పుకుంది. ఆ తరువాత అమెరికాకు చెందిన ఎమ్మా రాబర్ట్స్ అనే హీరోయిన్ ను ఫైనల్ చేసారని వార్తలు వచ్చాయి. కానీ ఎమ్మా రాబర్ట్స్ కూడా ఈ సినిమాలో నటించట్లేదని తెలుస్తుంది. ఇలా హీరోయిన్ విషయంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా యూనిట్ నుండి సరైన క్లారిటీ లేకపోవటం పట్ల ఎన్టీయార్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
 
ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీయార్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. చరిత్ర ప్రకారం వీరిద్దరూ ఒకరినొకరు కలవకపోయినా వీరిద్దరూ కలిసి పోరాటం చేస్తే ఏ విధంగా ఉంటుందనే ఆలోచనతో రాజమౌళి ఈ సినిమాను రూపొందించాడు. టాలీవుడ్లో ఇప్పటిదాకా వచ్చిన మల్టీస్టారర్ సినిమాలలో ఆర్ ఆర్ ఆర్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అని చెప్పవచ్చు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: