నాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ విషయంలో రోజురోజుకు వివాదం ముదిరిపోతోంది. ప్రస్తుతం ఇదే టైటిల్ తో ఒక చిన్న సినిమాను తీస్తున్న ఎస్ ఎమ్ కె ఫిలిమ్స్ పెడుతున్న కండిషన్స్ తో మైత్రీ మూవీస్ సంస్థకు చుక్కలు కనపడుతున్నట్లు సమాచారం. 

మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాకు ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ అన్న టైటిల్ పెట్టినా ఆ అక్షరాలు అన్నీ సమానంగా ఉండాలని ‘నానీస్’ అన్న అక్షరాలూ చిన్నవిగా ఉండటానికి వీలులేదు అంటూ ఎస్ ఎమ్ కె సంస్థ నిర్మాతలు పెడుతున్న కండిషన్స్ కు మైత్రీ మూవీస్ సంస్థకు తలనొప్పిగా మారాయి అని అంటున్నారు. దీనికితోడు ఈవివాదం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఫిలిం చాంబర్ ల మధ్య యుద్ధంగా మారే పరిస్థితి కూడ కనిపిస్తోంది.  

దీనితో ఈవిషయం పై రాజీకుదరకపోతే కోర్ట్ వివాదాలు తప్పక పోవచ్చు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈపరిస్థితి ఇలా కొనసాగుతూ ఉంటే ఈ మూవీకి బయ్యర్ల నుండి భారీ ఆఫేర్లు వస్తున్నట్లు సమాచారం. రాబోయే మీడియం రేంజ్ సినిమాలలో గ్యాంగ్ లీడర్ పై బాగ ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ ఉండటంతో ఈమూవీకి బిజినెస్ పరంగా భారీ ఆఫర్స్ వస్తున్నట్లు టాక్. 

వాస్తవానికి ఈ సినిమా ఆగష్టు ౩౦న విడుదల కావలసి ఉన్నా  ‘సాహో’ ఆ డేట్ కి వస్తున్న నేపధ్యంలో ప్రస్తుతానికి ఈమూవీ విడుదలను సెప్టెంబర్ రెండవ వారానికి వాయిదా వేశారు. అయితే చిరంజీవి ‘సైరా’ అక్టోబర్ 2కు విడుదల కాకపోవచ్చు అని లీకులు వస్తున్న నేపధ్యంలో ఈమూవీని దసరా రేస్ కు విడుదలచేయాలని మైత్రి సంస్థ భావిస్తున్నట్లు టాక్. దీనివల్ల దసరా సీజన్ దున్నుకోవచ్చు అన్నది గ్యాంగ్ లీడర్ ఆలోచన. అదే జరిగితే నానీకి పరోక్షంగా చిరంజీవి సహకరిస్తున్నాడు అనుకోవాలి.. 
.


మరింత సమాచారం తెలుసుకోండి: