షాహిద్ కపూర్ నటించిన " కబీర్ సింగ్ "ఎంతటి ఘన విజయం సాధించిందో అంతటి విమర్శలను కూడా మూట గట్టుకుంది. షాహిద్ కపూర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం తెలుగులో వచ్చిన "అర్జున్ రెడ్డి" సినిమాకి రీమేక్ . తెలుగు అర్జున్ రెడ్డి కి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా హిందీ రీమేక్ కి దర్శకత్వం వహించాడు. తెలుగులో కూడా ఈ సినిమాకి విమర్శలు వచ్చినప్పటికీ వాటిని సద్విమర్శలుగానే తీసుకున్న చిత్ర బృందం ఎక్కువగా రియాక్ట్ అవలేదు.


అయితే హిందీలో ఈ సినిమాపై అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి వ్యక్తిత్వం లేనట్టుగా చూపించారని, రేప్ కల్చర్ ని ఎంకరేజ్ చేసే విధంగా ఉందనే విమర్శ వచ్చింది. అయితే వీటిపై దర్శకుడు సందీప్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తున్నాడు. తాజాగా హీరో షాహిద్ కపూర్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విమర్శకులపై విరుచుకు పడ్డాడు. 


 సినిమాపై ఎవరి అభిప్రాయం వారికి ఉంటుందని దానిలో తప్పు లేదని , విమర్శ అనేది సినిమాలో ఉన్న లోపాల్ని ఎత్తి చూపే విధంగా ఉండాలి, సినిమాని మరింత బాగా ఎలా తీయవచ్చో తెలిపే సజేషన్ లా ఉండాలి తప్ప సినిమాని కించపరిచే విధంగా ఉండకూడదని అన్నాడు.  ఇంకా ప్రీతి క్యారెక్టర్ ని ఎందుకు చెంపదెబ్బ కొట్టారు అని అడుగుతున్నారు. కథా పరంగా అలా చేయాల్సి వచ్చిందని, అంతే కాని ఆడవాళ్ళని తక్కువ చేయాలనే ఉద్దేశ్యం కాదని చెప్పుకొచ్చాడు.


 ఒకవేళ అది మీకు నచ్చకపోతే మీరనుకున్న విధంగా సినిమా తీయండి. దాన్ని మేము రివ్యూ చేస్తాం అన్నాడు. సంజు సినిమాలొ రణ్ బీర్ కపూర్ ౩౦౦ మందితో పడుకున్నానని చెప్పిన డైలాగ్ కి ఎటువంటి అభ్యంతరం రాలేదని, అంతేగాక ఆ సినిమాలో  కమోడ్ పై భాగం తీసి సోనమ్ కపూర్ మెడలో వేస్తే దాన్ని పట్టించుకోకుండా  సినిమా బాగుందంటూ ప్రశంసించిన విమర్శకులు ఒక చెంప దెబ్బ కే ఇలా మాట్లాడుతున్నారని అన్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: