'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దీంతో ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న సాహో సినిమా ప్రధానమైన నాలుగు భాషల్లో తెరకెక్కిన క్రమంలో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. బాహుబలి సినిమాతో సినిమా ప్రపంచాన్నే తనవైపు తిప్పుకున్న ప్రభాస్ ఈ సినిమాతో ఇంకెన్ని మ్యాజిక్కులు చేస్తాడని దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతగానో ఆశగా ఆసక్తిగా సాహో సినిమా విడుదల గురించి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియోస్ అలాగే టీజర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చాయి. కానీ పోస్టర్లు సాంగ్స్ విషయంలో సాహో సినిమా యూనిట్ పై కాపీ అనే టాక్ వినబడుతోంది. ఈ సినిమాలో పోస్టర్లు హాలీవుడ్ సినిమా పోస్టర్ ని కాపీ కొట్టినట్లు పోస్టర్లపై కామెంట్లు ఇటీవల వచ్చాయి.


ఇదే క్రమంలో సినిమాకి సంబంధించి మొట్టమొదట విడుదలైన “ఏ చోట నువ్వున్న” అనే సాంగ్ సంగీతం విని ఇది కూడా కాపీ మ్యూజిక్ అనే కామెంట్లు వినబడుతున్నాయి. తాజాగా ఆ సాంగ్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చూడగానే ఇది పక్క కాపీ పేస్ట్ అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. కేవలం ట్రోల్స్ మాత్రమే కాదు.. ఈ సాంగ్ యొక్క ఒరిజనల్ సాంగ్ ని నెట్ లో వెతికిపట్టుకొని మరి చూపిస్తూ ఏకేస్తున్నారు. ఈ సాంగ్ ఒరిజినల్ మ్యూజిక్ అమెరికా దేశానికి చెందిన ది చైన్ స్మోకర్స్ అనే అమెరికన్ డీజే సంస్థ “డోన్’ట్ లెట్ మీ డౌన్” అనే సాంగ్ అప్పట్లో 2016 లో యూట్యూబ్ లో విడుదల చేసింది.


వరల్డ్ వైడ్ గా దీనికి పెద్ద స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. దాదాపు 140 కోట్లు వ్యూస్ ఆ సాంగ్ సొంతం. అలాంటి సాంగ్ ని సాహో మ్యూజిక్ డైరెక్టర్స్ కాపీ కొట్టి అడ్డంగా దొరికిపోయారు. మొదటి 30 సెకన్లు వినగానే మక్కికి మక్కి దించారని..ఈ సాంగ్ పై సినిమా యూనిట్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా హాలీవుడ్ పోస్టర్లను మ్యూజిక్ కాపీ కొట్టి ఇండియన్ సినిమాల స్థాయి తగ్గిస్తున్నారు అంత సినిమా పై మండిపడుతున్నారు. పోస్టర్లు సాంగ్స్ లోనే కాపీ అండ్ పేస్ట్ ఉంటే సినిమా కూడా కాపీ అండ్ పేస్ట్ అన్నట్టుగా మారిపోతుందని సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి దానికి తగ్గట్టు అవుట్ ఫుట్ ఇవ్వండి అంటూ సాహో సినిమా అభిమానులు సినిమా యూనిట్ ని వేడుకుంటున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: