అబ్బో ఈ మాట సోషల్ మీడియాలో ఎన్నో సార్లు విన్నామంటున్నా..టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి విషయంలో వచ్చే న్యూస్ అందరినీ ఆకర్షిస్తుంది.  ప్రభాస్ ‘ఈశ్వర్’ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు.   ఈ హీరోయి మంచి బ్రేక్ రావడానికి చాలా టైమ్ పట్టింది.  ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘చత్రపతి’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.  అప్పటి నుంచి ప్రభాస్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.  చత్రపతి లాంటి సూపర్ హిట్ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలు స్టార్ హీరోగా మార్చాయి.  మరోసారి రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మూవీ ‘బాహుబలి, బాహుబలి 2’లో నటించాడు.

ఈ సినిమాలతో ఏకంగా జాతీయ స్థాయి నటుడిగా పేరు సంపాదించాడు ప్రభాస్.  అయితే బాహుబలి మూవీ తెరకెక్కే సమయంలోనే ప్రభాస్ పెళ్లి ముచ్చట వచ్చిందని..ఓ ఇంజనీర్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని ఆ అమ్మాయి ఫోటోతో సహా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు.  కానీ బాహుబలి సీరీస్ పూర్తయ్యే వరక పెళ్లి ప్రస్తావన వొద్దని ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుతో అన్నాడట..దాంతో ఆ ప్రస్తావనకు అక్కడితోనే పులిస్టాప్ పడింది.  ఇక బాహుబలి సీరీస్ పూర్తయ్యింది ఇక ప్రభాస్ పెళ్లికి సిద్దం అన్న సమయంలోనే మరో సంచలన వార్తలు తెరపైకి వచ్చాయి. 

ప్రభాస్ తో బిల్లా, మిర్చి, బాహుబలి లాంటి సినిమాల్లో నటించిన సహనటి అనుష్కతో పెళ్లి జరగబోతుందని..వీరిద్దరి స్నేహం పెళ్లి వరకు వచ్చిందని మరికొన్ని వార్తలు సోషల్ మీడియాలో హంగామా చేశాయి.  కానీ తాము కేవలం స్నేహితులం మాత్రమే అని ప్రభాస్, అనుష్క లు ఖండించారు. అయితే ప్రభాస్ పెళ్లి విషయంపై తన ప్రమేయం లేకుండా వార్తలు రాయడం సబబు కాదని కృష్ణం రాజు మీడియాలో పలు మార్లు కోరుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్లి ప్రస్తావన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

  ప్రభాస్ ప్రస్తుతం సాహూ సినిమాలో నటిస్తున్నారు.  ఈ మూవీ రిలీజ్ తర్వాత అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.  అమెరికాలో వ్యాపారిగా స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కూతురితో ప్రభాస్ పరిణయం ఆడబోతున్నారని వార్తలు వస్తున్నాయి.  ఇది కూడా రూమరేనా..లేక ఏదైనా నిజం ఉందా అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు.  ఏది ఏమైనా ఇలాంటి వార్తలు నమ్మోద్దని ప్రభాస్ కుటుంబ సభ్యులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో ప్రభాస్ కుటుంబం స్పందించాల్సివుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: