సినిమా  ఇండస్ట్రీలో  నిలబడాలి అంటే హిట్స్ అందించాల్సిందే.  విజయమే అన్నింటిని నిర్ణయిస్తుంది.  అందుకే హిట్ కోసం ప్రతి ఒక్కరు  ట్రై చేస్తుంటారు.  హిట్ వచ్చింది అంటే సంతోషిస్తారు.  లేదు ఏదైనా తేడా వచ్చింది అంటే మరో ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం మాత్రం  ఆపరు.  ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టిన చాలా మంది సెకండ్ సినిమా హిట్ కోసం ట్రై చేస్తుంటాడు.  సెకండ్ సినిమా హిట్ కొడితే వాళ్ళు ఇండస్ట్రీలో స్థిరపడిపోతారు.  కానీ,  సెకండ్ సినిమా హిట్ కాకపోతే కొంత ఇబ్బంది పడుతుంటారు.  


ఆర్ ఎక్స్ 100 సినిమాతో కార్తికేయ ఇండస్ట్రీలో బెస్ట్ హిట్ అందుకున్నాడు.  మౌత్ టాక్ తో సినిమా హిట్ అయ్యింది.  బోల్డ్ కంటెంట్ తో సినిమా మంచి హిట్ కొట్టింది.  ఈ సినిమా తరువాత కార్తికేయ హిప్పీ సినిమా  చేశాడు.  తెలుగు తమిళ భాషల్లో రీలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.  సినిమా ఫెయిల్ కావడంతో కార్తికేయ ఫ్యూచర్ ఏంటి అన్నది అనుమానంగా మారింది. 

అయితే, ఈ హీరో రీసెంట్ గా గుణ 369 అనే సినిమా చేశారు.  ఈ మూవీ పెద్దగా విజయం సాధించలేదు.  పైగా, కథ ఎలా ఉన్నా సినిమాలో చొక్కా విప్పి బాడీని ప్రదర్శించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.  ఇది సినిమాకు మైనస్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలవడంతో వాట్ నెక్స్ట్ అనే మీమాంసలో పడిపోయాడు ఈ హీరో.  ప్రస్తుతం ఈ హీరో నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా నటించారు.  


ఎఫ్ 1 రేసర్ గా చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 13 వ తేదీన  రిలీజ్ కాబోతున్నది.  ఒకవేళ సినిమా హిట్టయితే... కార్తికేయకు పేరు వస్తుంది. లేదంటే మరో సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే.  కేవలం హీరోగా మాత్రమే ట్రై చేయకుండా.. ఎలాగో బాడీ కూడా ఉన్నది కాబట్టి అవసరం అనుకుంటే గ్యాంగ్ లీడర్ సినిమాలోలానే విలన్ గా కూడా నటిస్తే అవకాశాలు వస్తాయి.  అలా కాకుండా .. హీరో ట్యాగ్ ను మాత్రమే తగిలించుకొని కూర్చుంటే మాత్రం ఒక్క హిట్ తో సరిపెట్టుకొని జెండా ఎత్తెయ్యల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: