కేజీఎఫ్ తొంభై కోట్ల తో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సౌత్ లోని అన్ని భాషల తో పాటు హిందీ లో కూడా విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యింది. యష్ హీరో గా తెరకెక్కిన ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ తో పాటు ఎమోషనల్ ఎంటర్ టైనర్ కూడా అందుకే అంత పెద్ద సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమా కి సీక్వెల్ చేస్తున్నారు కేజీఎఫ్ టీం.

కేజీఎఫ్ సినిమా లో హీరో క్యారెక్టర్ కి అంత పేరు రావటానికి యాక్టింగ్ ఒక రీజన్ అయితే అంతే ఎక్కువ గా విలన్ రోల్ కూడా ఉండటమే ఈ హీరో ఎలివేషన్ కి కూడా కారణం. కేజీఎఫ్ లో విలన్ కి కూడా హీరోతో సమానంగా క్రేజ్ వచ్చింది. స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ లో కనిపించిన అధీరా సినిమాకీ క్రుయాలిటీ  తీసుకొచ్చాడు.  అసలు అధీరా అన్న పేరులోనే ఆ విలనిజాన్ని చూపించే ప్రయత్నం చేశారు. 

కేజీఎఫ్2  లో కూడా అదే రేంజ్ లో స్ట్రాంగ్ విలన్నీ సెట్ చేశారు రీసెంట్ గా అధీరా లుక్ ని కూడా రివీల్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అధీరా గా వచ్చిన పోస్టర్ ఆడియన్స్ కి బాగా నచ్చింది. సౌత్ హీరోలు ఇంతమంది ఉంటే బాలీవుడ్ సంజయ్ దత్తే ఎందుక ని యష్ ని అడిగితే ప్రశాంత్ నిల్ స్క్రిప్ట్ చెప్పినప్పట్నుంచి ఆధిరా క్యారెక్టర్ లో సంజయ్ దత్ అయితేనే బావుంటుందని ఆ క్యారెక్టర్ కి నూరు శాతం సెట్ అయ్యేది సంజయ్ దత్తే అనుకున్నామని చెప్పాడు.

మ్యాసివ్ లుక్  ఫిజిక్  ఉన్న సంజయ్ దత్ ఈ క్యారెక్టర్ కి కరెక్టు గా సూట్ అవుతాడని అనుకున్నాం.  సినిమా హిట్టయినా తరువాత లేక ఐదు భాషల్లో రిలీజ్ చేసిన తర్వాత అనే కాదు మొదటి నుంచి ఆధిరా గా సంజయ్ దత్తే మా మా మదిలో ఉన్నాడు అందుకే కేజీఎఫ్2  కి సంజయ్ దత్ నే అధిరగా తీసుకున్నామని క్లారిటీ ఇచ్చాడు యష్.


మరింత సమాచారం తెలుసుకోండి: