ఈ మ‌ధ్య కాలంలో న‌య‌న్ న‌టించే చిత్రాలు ఎక్కువ‌గా లేడీ ఓరియంటెడ్ చిత్రాల‌ను ఎన్నుకుంటుంది. డోరా,  ఐరా  వంటి కొన్ని హార‌ర్ చిత్రాల్లో న‌టించింది కాని ఆశించినంత ఫ‌లితం రాలేదు. ప్ర‌స్తుతం సైరా న‌ర్సింహారెడ్డి చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ను పోషిస్తోంది. టాలీవుడ్‌లో హై రెమ్యూన‌రేష‌న్ తీసుకునే ఈ భామ  ప్ర‌స్తుతం సీనియ‌ర్ హీరోల‌కు ఈమె మెయిన్ హీరోయిన్ అని చెప్పాలి. 


జీవా - నయనతార జంటగా తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో "వీడే సరైనోడు" పేరుతో అనువదిస్తున్నారు. నోవా సినిమాస్ పతాకంపై కోకా శిరీష సమర్పణలో జక్కుల నాగేశ్వరావు ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. కొంత గ్రామీణ.. కొంత నగర నేపథ్యంలో  ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ చిత్రంలో జీవా నటన,  నయనతార గ్లామర్ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని, సెన్సార్ పూర్తయిన "వీడే సరైనోడు" ఆడియో ఈనెల 8న రిలీజ్ చేసి.. ఇదే నెల 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని నోవా సినిమాస్ అధినేత జక్కుల నాగేశ్వరావు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్ దేవా, సాహిత్యం: వెన్నెలకంటి - చంద్రబోస్, మాటలు: రాజశేఖర్ రెడ్డి, సహ నిర్మాతలు: మాస్టర్ కోకా లోహితాక్ష్ - మాస్టర్ కోకా నిశ్చల్ సాయికృష్ణ, కథ-స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ఆర్ . ఎస్.రామనాథం !! మ‌రి ఈ చిత్రం న‌య‌న్‌కు ఎంత వ‌ర‌కు ఉప‌యెగ‌ప‌డుతుంది. తెలుగులో హిట్ అవుద్దా లేదా అన్న‌ది వేచి చూడాలి. ఇకపోతే సినిమా హిట్టు, ఫ్లాప్ ల గురించి కాస్త ప‌క్క‌న పెడితే ఈ సీనియ‌ర్ భామ గ్లామ‌ర్ కాస్త త‌గ్గింద‌ని కొంద‌రు భావిస్తున్నారు. ఇక‌పోతే న‌య‌న్ హిట్లు ఫ‌ట్ల‌తో సంబంధం లేకుండా సినిమాలు వ‌రుస‌గా చేసుకుంటూ వెళుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: