కొందరు భారతీయ మహిళా సైంటిస్టుల విజయగాధ.. మిషన్ మంగళ్ గా త్వరలో తెరపైకి వస్తోంది. ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ఈ సినిమా టీమ్ తాజాగా ఓ ట్రెయిలర్ రిలీజ్ చేశారు.. భారతీయ మహిళా శక్తిని.. మంగళయాన్ ఉపగ్రహ ప్రయోగాన్ని మేళవిస్తూ రాసిన ఓ గేయమే ఆ ట్రైలర్.. నిజంగా చాలా అద్భుతంగా ఉన్న ఈ గేయం.. హీరో నాగార్జునను కూడా కదిలించింది.


ఈ సినిమా టీమ్ ను నాగార్జున అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. మంగళ యాన్ ఉపగ్రహ ప్రయోగంలో అనితర సాధ్యమైన పాత్ర పోషించిన మహిళా సైంటిస్టుల గురించి కామెంట్ చేస్తూ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో మహిళాశక్తిని వర్ణించేందుకు మాటలు చాలవంటూ మెచ్చుకున్నారు. మిషన్ మంగళ్ ను మహిళలకు అంకింతం చేశారు నాగార్జున

ఈ గేయం ఇలా సాగుతుంది..

నీ గాజుల మోత రవళిస్తుంది...

ఒక స్వప్నం రాత్రి ఫలిస్తుంది..

ఎంత ఎత్తునుందో ఆకాశం..


సింధూరం.. దూరం పయనిస్తుంది.


మంగళ సూత్రం మెడలో ఉంది..

మంగళ గ్రహంపై చూపు ఉంది.

భారత దేశపు కన్య ప్రయాణం..

ప్రపంచమంతా హర్షిస్తుంది..

కళ్లల్లో బ్రహ్మాండం నిలిచే..

కాటుకతో ఇది హాసం నడిచే..

కొత్తదైన ఈ స్వాభిమానం..

ఓ కొత్త పగలునే తెస్తుంది..


సింధూరం.. దూరం పయనిస్తుంది.


అనంతమైన దారులలో నీ చీరచెంగు రెపరెపలాడనీ..

నీ చేతి గాజుల మోతలని.. తరతరాలకూ వినిపించనీ..

ఈ మూడు రంగుల ధ్వజం మనది..

నీ ధైర్యంతో ఎగురుతుంది..

సింధూరం దూరం పయనిస్తుంది..


అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న ప్రతిష్టాత్మక సినిమా మిషన్ మంగళ్.. మార్స్ గ్రహం మీదకు ఇండియా మామ్ ఉపగ్రహాన్ని ప్రయోగం ఇతి వృత్తంగా రూపొందించారు. అక్షయ్ కుమార్, విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సి, నిత్యామీనన్ తదితరులు నటిస్తున్న ఈ మూవీకి జగన్ శక్తి దర్శకుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: