అల్లు అర్జున్, బోయపాటి శీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా సరైనోడు.. మాంచి యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2016, ఏప్రిల్ 22 న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి... కేవలం మూడు వారాల్లోనే 101 కోట్లు కొల్లగొట్టింది. ఓవరాల్ గా 130 కోట్ల వరకూ వసులు చేసినట్టు చెబుతున్నారు.


అర్జున్ అర్జున్ కెరీర్‌లో సాలిడ్ హిట్ గా ఉన్న ఈ సినిమా ఇప్పుడు యూట్యూబ్ లోనూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా 200 మిలియన్ల వ్యూస్ సంపాదించి ఇండియన్ యూ ట్యూబ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ ఏ భారతీయ సినిమాకూ ఇన్ని వ్యూస్ రాలేదు మరి.


మరో విచిత్రం ఏంటంటే.. ఈ సినిమాను మొదటి సారి యూట్యూబ్ లో పోస్టు చేసినప్పుడు సాంకేతికపరమైన సమస్యలు వచ్చాయట. కొన్నిరోజుల తర్వాత డెలీట్ చేసి.. మళ్లీ కొత్తగా పోస్టు చేశారట.. అప్పటికీ 200 మిలియన్ వ్యూస్ సాధించింది. అలాంటి టెక్నికల్ మిస్టేక్ జరగకుండా ఉండి ఉంటే.. ఇంకెన్ని వ్యూస్ వచ్చిఉండేవో.. ఏదేమైనా ఈ రికార్డు.. అల్లు అర్జున్ కు నార్త్ ఇండియాలో ఉన్న ఫాలోయింగ్ ఏంటో చెబుతోంది.


ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఈ వ్యూస్ వచ్చింది తెలుగు సినిమా సరైనోడు కు కాదు.. సరైనోడు సినిమా హిందీ వర్షన్ కు .. అంటె సరైనోడు సినిమాను హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్ లో పెట్టారన్నమాట. సినిమాను డ‌బ్ చేసినా.. టైటిల్ మాత్రం అలాగే ఉంచేశారట. అంటే తెలుగు టైటిల్ సరైనోడుతోనే హిందీ వర్షన్ యూట్యూబ్ లో ఉందన్నమాట. మొత్తం మీద 200 మిలియన్ వ్యూస్ సాధించిన తొలి భారతీయ సినిమాగా యుట్యూబ్ లో సరైనోడు ఇలా రికార్డు సృష్టించిందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: