రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ గా ఉంటుంది. సినిమాల్లో ఉంది కాబట్టి కామెంట్స్ ఆమెకు ఎక్కువగా  ఉంటాయి. అవి మంచిగా చెడుగా కూడా ఉంటాయి. వాటిని లైట్ గా తీసుకుంటేనే మనసుకు శాంతి ఉంటుంది. ఆ మాటకు వస్తే సెలిబ్రిటీస్ కి ఇపుడు సోషల్ మీడియా వరం, అదే టైంలో శాపం కూడా. ఓ విషయం సెకెన్ల టైంలో వైరల్ అయిపోతోంది. నిజం కాకుండా ఉంటే ఆ బాధ చెప్పనలవి కాదు. ఇదీ నిజం అని చెప్పేలోగానే అబద్దం లోకాన్ని చుట్టేస్తుంది. ముఖ్యంగా సినిమా హీరోయిన్లకు ఈ ట్రోలింగ్ చాలా పెద్ద ఇబ్బంది. 


ఇపుడు అలాంటి ట్రబుల్ రకుల్ ఫేస్ చేస్తోంది. హీరోయిన్ అన్నాక నచ్చిన పాత్ర చేస్తుంది. కేవలం నటన కాబట్టి ఆమె ఎవరితోనైనా యాక్ట్ చేసే అధికారం, అవకాశం వుంది. వారు సీనియర్ హీరోలు అయినా సరే ఆమెకు లేని అభ్యంతరం వేరే ఎవరికి ఉండాలి. ఎందుకు ఉండాలి. ఇదిలా ఉండగా రకుల్ చాన్సులు లేక ఫిఫ్టీస్ దాటిన హీరోలతో చేస్తోంది. అజయ్ దేవగణ్ తో బాలీవుడ్లో చేసిన ఆమె తెలుగులో నాగార్జున తో మన్మధుడు చేసింది. నాగార్జున 60 ఏళ్ళ హీరో.


ఇక మన్మధుడు 2 మూవీలో కధ ప్రకారం నాగార్జున లేట్ వయసు లో రొమాన్స్ చేసే హీరో పాత్ర చేస్తున్నాడు. ఈ మూవీలో నాగ్ తో రకుల్ కధను అనుసరించి ఘాట్ రొమాన్స్ చేయాలి. ఎందుకంటే ప్రేమ, పెళ్ళికి యాంటీగా ఉన్న హీరోను ముగ్గులోకి దింపే క్యారక్టర్ రకుల్ ది. దాంతో ఆమె బోల్డ్ గానే యాక్ట్ చేసింది. నిజానికి రకుల్ నాగ్ పెద్ద కొడుకు నాగ చైతన్య పక్కన రారండోయ్ వేడుక చూద్దాం మూవీలో పెయిర్ గా నటించింది. కొడుకుతో రొమాన్స్ పండించిన రకుల్ తో తండ్రి నాగ్ నటిస్తున్నాడు.


ఇందులో కిస్సులు, కిస్ మిస్సులు చాలా  ఉన్నాయట. మసాలా కధ ఇంకా ఉందట. ఇందులో కొన్ని టీజర్లో రావడంతో రకుల్ ని సోషల్ మీడియా ఓ ఆట ఆడుకుంటోంది. నీ ఏజ్  ఏంటి, చేస్తున్నదేంటి అంటూ ఒకటే ట్రోలింగ్ ట. నాగ్ వంటి సీనియర్ హీరో తో ఆ వెకిలి ప్రేమలేంటి అంటూ తెగ ఆడేసుకుంటున్నారుట.  మాములూగా అయితే ఈ టైప్ ట్రోలింగ్ కి రకుల్ వెంటనే ఆన్సర్లు గట్టిగానే పెడుతుందట. అలా పెట్టి మరీ ఎక్కువగా ట్రోలింగ్ తెచ్చుకుంటోందట.


 దాంతో అవన్నీ ఇపుడు భరించలేనంతగా తయరయ్యాయట. ఈ ట్రోలింగ్ ఎలా తట్టుకోవడమో రకుల్ కి అర్ధం కావడం లేదుట. అయితే మూవీ రిలీజ్ అయి హిట్ అయితే ఆ అక్సెప్టెన్స్ అదే వచ్చేస్తుంది, అపుడు ఈ పెయిర్ ని పొగుడుతూ రివర్స్ ట్రోలింగ్ స్టార్ట్ అవుతుందని రకుల్ కి సన్నిహితులు చెబుతున్నారుట. మొత్తానికి ఇందుకోసమైన మన్మధుడు 2 హిట్ కావాలని రకుల్ గట్టిగా కోరుకుంటోదట.


మరింత సమాచారం తెలుసుకోండి: