ఆయుష్మాన్ ఖురానా , యామి గౌతమ్ జంటగా నటించిన హిందీ చిత్రం విక్కీ డోనర్. రొమాంటిక్ కామెడీ నేపథ్యం లో తెరకెక్కిన ఈచిత్రం 2012లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. కాగా ఈ చిత్రం బెస్ట్ పాపులర్ మూవీ విబాగంలో నేషనల్ అవార్డును కూడా గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని 2016లో 'నరుడా డోనరుడా' పేరుతో తెలుగులో రీమేక్ చేశారు.
సుమంత్ , పల్లవి లీడ్ రోల్ లో నటించగా ఈ చిత్రం హిందీ లో లాగా విజయాన్ని సాదించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళం లో రీమేక్ చేస్తున్నారు. 'ధారలా ప్రభు' అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా తెలుగులో నాగ చైతన్య తో యుద్ధం శరణం అనే చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ కృష్ణ మరిముత్తు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ అంత చెన్నై లోనే జరుగనుంది. మరి తమిళం లో ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. మరి తమిళం లో ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. కాగా కోలీవుడ్ లో తాన్య కు ఇది రెండవ సినిమా. అరుణ్ విజయ్ నటించిన తడం తో ఎంట్రీ ఇవ్వగా ఈచిత్రం సూపర్ హిట్ అయ్యింది.
ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ యంగ్ బ్యూటీ తాన్య హోప్ నటించనుంది. ఇక తాన్య హోప్ ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న సైన్టిఫిక్ థ్రిల్లర్ డిస్కో రాజా లో ఓ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో ఆమె తోపాటు నాబా నటేష్ , పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంతకుముందు తాన్య తెలుగులో నేను శైలజ (అతిథి పాత్ర), అప్పట్లో ఒకడుండేవాడు, పటేల్ సర్ , పేపర్ బాయ్ చిత్రాల్లో నటించింది.