బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో దీపికా పదుకొనె ఒకరు.  మోడలింగ్ రంగం నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.  మోడలింగ్ చేస్తూనే బాడ్మింటన్ క్రీడాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  బాలీవుడ్ లో వరసగా సినిమా ఆఫర్లు దక్కించుకొని దూసుకుపోతున్నది.  టాప్ స్థానానికి రావడానికి ఆమె ఎంతగా కృషి చేసిందో చెప్పక్కర్లేదు.  ప్రతి సినిమాకు తన పెర్ఫార్మన్స్ ను పెంచుకుంటూ పోయింది.  ఓం శాంతి ఓం తరువాత దీపికాకు డిమాండ్ పెరిగింది.  


చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో ఆమె నటనకు అందరు ఫిదా అయ్యారు.  ఆ తరువాత వచ్చిన బాజీరావ్ మస్తానీ, పద్మావతి సినిమాలు ఆమె స్టార్ ఇమేజ్ ను ఎక్కడికో తీసుకెళ్లాయి.  ప్రస్తుతం ఈ అమ్మడు తన భర్త రణ్వీర్ సింగ్ తో కలిసి 1983 సినిమా చేస్తున్నది.  ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో దూసుకుపోతున్నది.  సోషల్ మీడియాలో దీపికాకు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నది.  ఏదైనా ఒక ఫోటోను షేర్ చేస్తే చాలు లక్షల్లో లైకులు, షేర్లు వస్తుంటాయి.  


బాలీవుడ్ టాప్ సోషల్ మీడియా సెలెబ్రిటీలలో దీపికా కూడా ఒకరు.  వీటితో పాటుగా దీపికా పలురకాల బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. అంతేకాదు,  పలు మ్యాగజైన్ కవర్ పేజీలకు ఈ అమ్మడు ఫోజులు ఇస్తూ దూసుకుపోతుంటుంది.  బికినీ ట్రీట్ ఇవ్వడంతో ఈ అమ్మడు స్టైల్ వేరుగా ఉంటుంది. 


ఇలాంటి దీపికా పదుకొనెకు ఓ విచిత్రమైన అలవాటు ఉన్నది.  ఎక్కడైనా స్టార్ హోటల్స్ లో దిగినప్పుడు అక్కకి షాంపు బాటిళ్లను కలెక్ట్ చేస్తుందట.  కలెక్ట్ చేయడం అంటే కొని దాచుకోవడం కాదు.  హోటల్స్ లో కాంప్లిమెంటరీగా ఇచ్చే వాటిని దొంగతనంగా తెచ్చేసుకుంటుందట.  ఒక్కొక్కరికి ఒక్కోరకమైన వీక్నెస్ ఉంటుంది కదా.  అలానే ఈ అమ్మడికి కూడా ఈ రకమైన వీక్నెస్ ఉందనుకుంటా.  


మరింత సమాచారం తెలుసుకోండి: