బిగ్ బాస్ సీజన్ 3లో అందరు సేఫ్ గేమ్ ఆడుతూ ఎవరికి వారు మిగతా ఇంటి సభ్యుల మనసులు గెలవాలని చూస్తున్నారు. శనివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున కంటెస్టంట్స్ చేస్తున్న తప్పొప్పులను సమీక్షించాడు. ముఖ్యంగా తమన్నా, వరుణ్ సందేశ్ ల మీద నాగ్ సీరియస్ అయ్యాడు. అయితే ఈ వారం 8 మంది కంటెస్టంట్స్ నామినేషన్ లో ఉండగా నలుగురిని నిన్న సేఫ్ చేశాడు నాగార్జున.          


ఈరోజు నామినేషన్ లో ఉన్న నలుగురు సభ్యులు.. జాఫర్, వితిక, వరుణ్ సందేశ్, పునర్నవిలో ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. అయితే ఈవారం ఎపిసోడ్ లో సర్ ప్రైజ్ గా ఇద్దరిని ఎలిమినేట్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఎవరు ఊహించనిది జరిగేదే బిగ్ బాస్. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో జాఫర్, వితికల పేర్లు టాప్ ప్లేస్ లో ఉన్నాయి.  


టివి 9 లో ముఖాముఖితో బాగా ఫేమస్ అయిన జాఫర్ బిగ్ బాస్ హౌజ్ లో పెద్దగా హడావిడి చేయట్లేదు. ప్రతి విషయాన్ని సేఫ్ గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మరో పక్క వితిక కూడా వరుణ్ సందేశ్ ఆట చెడగొడుతుందన్న టాక్ బాగా ఉంది. అంతేకాదు హౌజ్ లో గొడవలకు ఆమె కొంత కారణం అని అంటున్నారు.


సో ఈరోజు ఒకరు ఎలిమినేషన్ అయితే అది జాఫర్ అని.. ఒకవేళ ఇద్దరిని బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తే వితిక కూడా ఇంటి నుండి బయటకు వస్తుందని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 బుల్లితెర ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది. హోస్ట్ గా నాగార్జున కూడా మెప్పిస్తున్నాడు. శనివారం ఎపిసోడ్ నాగార్జున యాంకరింగ్ అలరించింది. ఈరోజు ఒకరిని ఎలిమినేట్ చేయడంతో పాటుగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారని తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: