ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్ట్ లో సన్నీలియోన్ కూడా ఉన్నది.  పెద్దల సినిమా నుంచి బాలీవుడ్ కు వచ్చి ఎలాగోలా ఆఫర్లు దక్కించుకుంది. మొదట్లో ఆమెతో సినిమాలు చేయడానికి పెద్దగా ఎవరు ముందుకు రాలేదు.  ఏ రేటెడ్ సినిమాలు చేసే వాళ్ళు మాత్రమే ఆమెకు అందుబాటులో ఉన్నారు.  ఆమె ఏ మాత్రం సిగ్గుపడకుండా ఆ సినిమాలు చేసింది.  సూపర్ హిట్ అందుకుంది.  సన్నీ లియోన్ నటనకు ఫిదా అయినా చాలామంది హీరోలు ఆమెతో సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు.  


అదే సమయంలో సన్నీలియోన్ నార్త్ నుంచి సౌత్ కు  కూడా వచ్చింది.  సౌత్ సినిమా ఇండస్ట్రీలోని నాలుగు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది.  రీసెంట్ గా ఈ అమ్మడు అర్జున్ పాటియాలా అనే పంజాబీ సినిమా చేసింది.  ఈ మూవీలో సన్నీలియోన్ పాత్ర చేయలేదు.  ఓ సాంగ్ మాత్రమే చేసింది.  ఆ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.  సినిమా హిట్ కొట్టడంతో.. పాపులారిటీ పెరిగింది.  అయితే, సాంగ్ పూర్తయ్యాక ఆమె చెప్పిన ఫోన్ నెంబర్ తనకు తిప్పలు తెచ్చిపెట్టాయి.  


తనకే కాదు.. ఢిల్లీకి చెందిన పునీత్ అగర్వాల్ అనే వ్యక్తికి కూడా తిప్పలు తెచ్చిపెట్టాయి.  ఆ ఫోన్ నెంబర్ ఢిల్లీకి చెందిన అగర్వాల్ ది.  ఎప్పుడైతే సన్నీలియోన్ ఫోన్ నెంబర్ చెప్పిందో అప్పటి నుంచి పాపం అతనిఫోన్ మూగబోతే ఒట్టు.. ఎప్పుడూ మోగుతూనే ఉన్నది. 

సన్నీలియోన్ కావాలని, దానికోసం డబ్బులు ఇస్తామని చెప్తూ మెసేజ్ లు, ఫోన్లు చేసి విసిగిస్తున్నారట.  దీంతో పునీత్ అగర్వాల్ పోలీసులకు కంప్లైట్ చేశారు.  ఈ విషయం తెలిసిన సన్నీలియాన్.. స్పందించి వెంటనే పునీత్ కు క్షమాపణలు తెలిపింది.  తన వలన ఇబ్బందిపడిన పునీత్ ను క్షమించాలని వేడుకుంది.  సన్నీలియోన్ డైరెక్ట్ గా క్షమించమని అడిగితె కాదంటాడా చెప్పండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: