రామ్ చరణ్ హీరోగా సినిమాలు చేస్తూనే.. తండ్రి కోసం కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  రెండు పదవులను చరణ్ ఎంతో చాకచక్యంతో నిర్వహిస్తున్నాడు.  ఎక్కడా ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా ఒక నిర్మాతగా వ్యవహరిస్తూ సినిమాలు నిర్మిస్తున్నాడు. 


నిర్మాతగా ఖైదీ నెంబర్ 150 సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు.  మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా అదిరిపోయింది.  ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో నెక్స్ట్ సినిమా సైరాకు తెరమీదకు తీసుకొచ్చారు.  సైరా షూటింగ్ కంప్లీట్ చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుకుంటోంది. 


పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్  భారీ స్థాయిలో ఉండబోతున్నాయి.  ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన పనులు చాలా పెండింగ్ లో ఉన్నాయి.  అందుకోసమే ప్రపంచంలోని టాప్ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలకు సైరా పనులు అప్పగించారు.  దాదాపుగా 23 కంపెనీలు ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ లో భాగం పంచుకుంటున్నాయి. 


అనుకున్నట్టుగా అక్టోబర్ 2 వ తేదీ వరకు సినిమాను రిలీజ్ చేయాలి అంటే.. రాత్రీపగలు కష్టపడాల్సిందే.  అలా చేస్తేనే సినిమా అనుకున్నట్టుగా బయటకు వస్తుంది.  ఏదైనా తేడా జరిగితే మరోసారి పోస్ట్ ఫోన్ చేసుకోవాల్సి వస్తుంది.  సినిమాను పోస్ట్ ఫోన్ చేయకుండా దసరాకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో యూనిట్ కష్టపడుతున్నది.  విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రాణం కావడంతో వాటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తూనే .. అప్పుడప్పుడు సమయం చూసుకొని సైరావైపు చూస్తున్నారు. దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కించారు.  అమితాబ్ లాంటి స్టార్స్ నటించడం విశేషం.  నయనతార మెయిన్ హీరోయిన్ గా చేస్తున్నది.  అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.  ఆగస్టు 22 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: