మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇకపోతే మరోవైపు మెగాస్టార్ తన తదుపరి 152వ సినిమా కోసం ఇప్పటికే తన శరీర ఆకృతిని మార్చుకోవడం కోసం కసరత్తులు మొదలెట్టారు. కొద్దిరోజుల క్రితం విశాఖపట్నం లోని ఒక స్పాలో మెగాస్టార్, స్లిమ్ అవడం కోసం ప్రత్యేకంగా చికిత్స తీసుకున్నట్లు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. 

కొరటాల శివ దర్శకత్వంలో మంచి యాక్షన్ మరియు కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్ ఒక అద్భుతమైన రోల్ లో నటించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం చాలా బరువు తగ్గి స్లిమ్ గా మారిన మెగాస్టార్ ని చూసిన వారందరూ ఆయన వయసు పెరగడం కాదు, చాలా వరకు తగ్గుతున్నట్లు కనపడుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గారిని ఆయన కోడలు ఉపాసన 'బి పాజిటివ్' అనే ఒక జాతీయ పత్రిక కోసం స్పెషల్ గా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇక ఆ పత్రిక కోసం మెగాస్టార్ పై ఒక ఫోటో షూట్ నిర్వహించారు. ఆ ఫోటో షూట్ లో మెగాస్టార్ ని చూస్తే నిజంగా అందరికి ఆశ్చర్యం వేస్తుంది. 

బ్లాక్ కలర్ టీ షీర్ట్ మరియు ట్రెండీ స్పెట్స్ పెట్టుకుని పలు రకాల ఫోజుల్లో మెగాస్టార్ అదరగొట్టారు. ఇక ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసే ఆగలేకపోతున్న మెగా ఫ్యాన్స్, రేపు కొరటాల సినిమాలో ఆయన లుక్ ని చూస్తే వారికి మరింత మతిపోతుందని అంటున్నాయి సినిమా వర్గాలు. ఇక ప్రస్తుతం ఈ న్యూ లుక్ లో చిరంజీవిని చూసిన తెలుగు ప్రేక్షకుల్లోని చాలామంది, ఎంతో ఆశ్చర్యం మరియు ఆనందంతో తమ సోషల్ మీడియా ఖాతాల్లో సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారట.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: