‘సైరా’ కోసం భారీ కసరత్తులు చేసి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రకోసం చిరంజీవి తన లుక్ లో చాల మార్పులు చేసుకున్నాడు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ పాత్ర కాబట్టి ఆపాత్రకు తగ్గట్టుగా భారీగా కనిపించడానికి బరువు పెరిగాడు. ఇప్పుడు ఆసినిమా షూటింగ్ పూర్తి కావడంతో చిరంజీవి త్వరలో ప్రారంభం కాబోతున్న కొరటాల శివ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. 

ఈ మూవీలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్న పరిస్థితులలో చిరంజీవి లుక్ లో మార్పులు చేసుకోవాలని కొరటాల కోరడంతో 64 సంవత్సరాల చిరంజీవి కొరటాల కోరికమేరకు డైటింగ్ చేయడమే కాకుండా కేరళాలోని ప్రకృతి వైద్య ఆశ్రమంలో కొంత తన శరీర బరువుకు సంబంధించిన చికిత్య చేయించుకుని చిరంజీవి లుక్ లో పూర్తి మార్పులు చేసుకున్నాడు. అంతేకాదు మెగా స్టార్ 10 కేజీల బరువు తగ్గించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

లేటెస్ట్ గా చిరంజీవి కొత్త లుక్ కు సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో లీక్ చేసింది. అంతేకాదు ఈ ఫోటోను ఉపాసన అపోలో హాస్పిటల్స్ తరుపున నడుపుతున్న హెల్త్ మ్యాగజైన్ ‘బీ పాజిటివ్’ కవర్ పేజీ పై ప్రచురించింది. ఈ ఫోటోను చూస్తుంటే సరిగ్గా పాతికేళ్ల క్రితం చిరంజీవి ఎలా ఉండేవాడో అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది.  

చక్కగా ఒక సైడ్‌కు దువ్విన జుట్టుతో కొద్దిగా సిగ్గు పడుతూ చేతికి గడియారంతో కళ్ల జోడు పెట్టి బ్లాక్ అండ్ వైట్‌ లో తీసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఈరోజు హాట్ టాపిక్ గా మారాయి. కొరటాల మూవీలో చిరంజీవి నక్సలైట్ భావాలు ఉన్న ఒక మధ్య వయస్కుడి పాత్రలో అదేవిధంగా నిరంతరం జోష్ లో కనిపించే యువకుడి పాత్రలో నటిస్తున్న నేపధ్యంలో ఈ రెండు పాత్రలకు సరిపోయే విధంగా చిరంజీవి తన లుక్ లో మార్పులు చేసుకున్నాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: