శ్రీ సాయి అమృత లక్ష్మీ క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్ర‌ణ‌వి ప్రొడ‌క్ష‌న్స్ , శ్రీ లక్ష్మీ న‌ర‌సింహా క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో విజ‌య్, మ‌ధుప్రియ‌, ఆశ రాథోడ్, ప్రేమల‌ను  హీరో , హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ పాలిక్ ద‌ర్శ‌క‌త్వంలో తిరుప‌తి ప‌టేల్, రామ్, భాను , నీలిమ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `మురికివాడ‌`. ఈ చిత్రం ప్రారంభోత్స‌వ కార్యక్ర‌మం ఈ రోజు రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా ల‌య‌న్ సాయి వెంక‌ట్ కెమేరా స్విచాన్ చేశాను. రామ‌స‌త్య‌నారాయ‌ణ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 


అనంతరం  ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ద‌ర్శ‌కుడు పాలిక్ మాట్లాడుతూ...``మురికి వాడ నేప‌థ్యంలో జ‌రిగే క‌థాంశమిది. ఇందులో ఫ్రెండ్ షిఫ్, ఎమోష‌న్స్ , సోష‌ల్ మెసేజ్ తో పాటు అన్ని వ‌ర్గాల‌కు కావాల్సిన క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్  ఉంటాయి. త్వరలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి... మూడు షెడ్యూల్స్ లో షూటింగ్ కంప్లీట్ చేస్తాం. నా ఫ‌స్ట్ సినిమా `వెంచ‌ప‌ల్లి` చిత్రంతో కొత్త‌వారిని ప‌రిచ‌యం చేస్తున్నా...అలాగే ఈ సినిమా లో కూడా కొత్త హీరో ,హీరోయిన్స్ ని ప‌రిచ‌యం చేస్తున్నాం. ఇందులో ఐదు పాటలుంటాయి. చైత‌న్య సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు`` అన్నారు.


 నిర్మాతలు మాట్లాడుతూ...`` ద‌ర్శ‌కుడు పాలిక్ గారు `వెంచ‌ప‌ల్లి` సినిమా చేస్తున్న తీరు న‌చ్చి ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో  ఈ సినిమా చేయ‌డానికి ముందుకొచ్చాం. ఈ సినిమా ద్వారా కొత్త వారిని ప‌రిచ‌యం చేస్తున్నాం.  క‌థ‌, క‌థ‌నాలు ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటూ అంద‌ర్నీ అల‌రిస్తాయి`` అన్నారు.
హీరో విజ‌య్ మాట్లాడుతూ...``పాలిక్ గారు ఓ మంచి కాన్సెప్ట్ తో న‌న్ను హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నారు. నా ఫ‌స్ట్ సినిమాకు మీ అంద‌రి బ్లెస్సింగ్స్ ఉంటాయని కోరుకుంటున్నా`` అన్నారు.


 న‌టి గీతా సింగ్ మాట్లాడుతూ..`` ఇంత వ‌ర‌కు చేయ‌ని ఓ డిఫ‌రెంట్ క్యార‌క్ట‌ర్ `మురికివాడ‌` చేస్తున్నాను`` అన్నారు.
 న‌టుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ...``ఇందులో నేను నెగిటివ్ క్యార‌క్ట‌ర్ లో కనిపిస్తాను`` అన్నారు. 
 అశోక్ కుమార్, గీతాసింగ్, మాస్ట‌ర్ అభిగ్య‌న్, మాస్ట‌ర్ ల‌క్కీ, బేబి ప్ర‌ణ‌వి, పంక‌జ్, రోహిత్, రామ్ సింగ్, వంశీకృష్ణ‌, చంద్ర సిద్ధార్థ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫిః మ‌ల్లిఖార్జున్,  నిర్మాత‌లుః తిరుప‌తి పటేల్, రామ్, భాను, నీలిమ; క‌థ‌-స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వంః పాలిక్. 


మరింత సమాచారం తెలుసుకోండి: