వరుస ఫ్లాపుల్లో ఉన్న ఎనర్జిటిక్ హీరో రామ్ కి అదిరిపోయే 'ఇస్మార్ట్ శంకర్' వంటి మాస్ సినిమా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ అందించారు. ఈ సినిమా రాకముందు ఇద్దరి కెరీర్లు దాదాపు ఇండస్ట్రీ లో దుకాణం సరిచేసుకునే పొజిషన్ లో ఉన్నాయి అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎనర్జిటిక్ హీరో రామ్ కి చాలా సంవత్సరాల నుండి ఒక్క హిట్టు సినిమా కూడా లేదు. దీంతో ఎన్ని సినిమాలు చేసినా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడటంతో చేస్తున్న సినిమాలు ప్రేక్షకులకు నచ్చకపోవడంతో మొట్టమొదటిసారిగా గతానికి భిన్నంగా కొత్తగా ఆలోచించి పూరి జగన్నాథ్ చెప్పిన మాస్ స్టోరీ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ఓకే చెప్పాడు.


అప్పట్లో ఈ సినిమా రాకముందు వరుసగా క్లాస్ సినిమాలు చేస్తూ అలరించిన రామ్ కి 'ఇస్మార్ట్ శంకర్' సినిమా రూపంలో అదిరిపోయే మాస్ హిట్ అందడంతో ఇప్పుడు తర్వాత చేయబోయే సినిమాలు ఏ విధమైనవి చేయాలి అన్న డైలమాలో పడిపోయాడు రామ్. రాబోయే రోజుల్లో ఇదే జోన్ లో కంటిన్యూ అవుతూ మాస్ సినిమాలు చేయాలా,లేక సాప్ట్ రొమాంటిక్ కామెడీలు గతంలో మాదిరి చేసుకుంటూ వెల్లాలా అనేది తేల్చుకోలేకపోతున్నాడు రామ్.


అయితే ఇస్మార్ట్ శంకర్ కు ముందు రామ్ ఓ మూడు స్క్రిప్టు ఓకే చేసి పెట్టుకున్నాడు. అవి సాప్ట్ గా సాగే స్టోరీలు. కొద్ది పాటి యాక్షన్ ని వాటికి కలుపుదాం అని ఆ డైరక్టర్ ప్రపోజల్స్ పెడుతున్నారట. కానీ రామ్ కే దైర్యం చాలటం లేదని రామ్ ప్రస్తుత పరిస్థితికి కారణం పూరి జగన్నాథ్ అని ఇండస్ట్రీలో ఉన్న వారు అంటున్నారు. అయితే తాజాగా మాస్ ఇమేజ్ రావడంతో మాస్ కథలతోనే రెండు మూడు సినిమాలు చేసి తర్వాత గత క్రేజ్ కి తగ్గ స్క్రిప్ట్ తో క్లాస్ సినిమాలు చేసుకుంటూ పోతే బాగుంటుందని మరొక పక్క రామ్ కి సన్నిహితులు సలహాలు ఇస్తున్నారట. మరి ఏ విధమైన సినిమాతో రామ్ రాబోయే రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: