స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం



స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని ఒకరంటే స్నేహబంధమూ ఎంత మధురము అని మరొకరు పాడుకుంటున్నారు.  ఇదంతా ఎవరి కోసం అనుకుంటున్నారా అదేనండీ మన మన యువ కథానాయకులు రామ్ చరణ్ తేజ్, మరియు జూనియర్ నందమూరి తారక రామారావు ఈ కథ.   స్నేహితుల దినోత్సవం సందర్భంగా వీరిరువురూ సామాజిక మాధ్యమాలలో వేరువేరుగా స్పందించారు. అదేనండీ ఈ కథంతా.

 తమ మధ్య చాలా మంచి స్నేహం ఉంది అని మరియు తమ బంధం చాలా దృఢమైనది అని ఈ సందర్భంగా  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అన్నారు. నీ స్నేహం ఇలాగే ఉంటుంది రామ్ చరణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా  చెప్పారు తారక్ తో తన స్నేహం గురించి చెప్పడానికి మాటలు చాలని, అతని తో స్నేహం వెలకట్టలేనిది అని రామ్ చరణ్ తేజ్ చెప్పారు. తారక్ ఒక అద్భుతమైన వ్యక్తి అని ఈ సందర్భంగా రాంచరణ్  అన్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో వ్యక్తం చేశారు.   స్నేహం చాలా గొప్పది అని తమది ఎన్నటికీ విడదీయలేని బంధం అని జూనియర్ ఎన్టీఆర్ ఆనందంగా  తెలియజేశారు. 

రామ్  చరణ్ చాలా మంచి వ్యక్తి అని  స్నేహానికి చాలా విలువ ఇస్తాడని  జూనియర్ నందమూరి తారక రామారావు ట్విట్టర్లో తెలిపారు.  సమయం చాలా అద్భుతంగా ఉంటుంది అని ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీ రామారావు  చెప్పాడు.

ఇదండీ  మన యువ కథానాయకులు ఇద్దరూ   వారిరువురి స్నేహం గురించి స్నేహితుల రోజు సందర్భంగా  మనకు చెప్పిన సంగతులు




మరింత సమాచారం తెలుసుకోండి: