బాలీవుడ్ లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండే సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. ఒకవేళ ఫీమేల్ లీడ్ రోల్ సినిమాలు వచ్చినా పెద్దగా ఆకట్టుకుంటాయా అన్నది డౌట్. ఇటీవల కాలంలో ఈ వ్యవహారంలో చాలా మార్పులు వచ్చాయి.   బాలీవుడ్ లో ఫిమేల్ లీడ్ రోల్ చేస్తున్న సినిమాలు అనేకం అవుతున్నాయి.


కంగనా రనౌత్ క్వీన్, దీపికా పాడుకొనే పద్మావతి సినిమాలో ఈ కోవలోకి వచ్చేవే.  దీపికా పాడుకొనే లీడ్ రోల్ చేసిన పద్మావతి సినిమా సూపర్ హిట్టైంది.  అంతేకాదు.. ఏకంగా రూ.600 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది దీపికా.  ఇక‌పోతే అస‌లు విషయానికి వ‌స్తే దీపిక ఇటీవ‌ల వోగ్ అనే ఆంగ్ల ప‌త్రిక‌కు క‌వ‌ర్ పేజి కోసం మేక‌ప్ లేకుండా ఫొటో షూట్ లో పాల్గొంది. ఆ ఫొటోస్ అన్నీ ఇన్‌స్టాగ్రామ్ అయిన సోష‌ల్ మీడియాలో  షేర్ చేసి అంద‌రితో పంచుకుంది. పంచుకుంటూ ఫొటో కింద ఎటువంటి మేక‌ప్ హంకు ఆర్భాటం లేకుండా దిగిన ఫొటో ఇది అని పోస్ట్ చేసింది.


ప్ర‌ముఖ నిర్మాత‌ అల్లుఅర‌వింద్ రామాయ‌ణం చిత్రాన్ని 1500 కోట్ల‌బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న సంగ‌తి విధిత‌మే. ఆ చిత్రంలో హృతిక్‌ రోష‌న్ రాముడు పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం.  అయితే హృతిక్ మాత్రం దీనిపై స్పందించ‌లేదు.  ఈ సినిమాలో హృతిక్ ప‌క్క‌న సీత పాత్ర‌లో న‌య‌న‌తార అయితే బావుంట‌ద‌ని నిర్మాత అల్లు అర‌వింద్ అన్నారు. ఎందుకంటే శ్రీ‌రామ‌రాజ్యం చిత్రంలో న‌య‌న్‌తార సీత పాత్ర‌లో జీవించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది కాబ‌ట్టి. న‌య‌న్ అయితే ఆ పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌ల‌ద‌న్న న‌మ్మ‌కంతో అల్లు అర‌వింద్ ద‌ర్శ‌కుడికి చెప్పారు. అయితే  ద‌ర్శ‌కుడు దీపికా ప‌దుకొనేను ఎంపిక చేసే ప‌నిలో ఉన్నారు. ఎందుకంటే ప‌ద్మావ‌త్ చిత్రంలో దీపిక అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించింది. ప‌ద్మావ‌త్ త‌ర్వాత దీపిక ఏ చిత్రంలోనూ న‌టించిలేదు. త‌ర్వాత త‌న పెళ్ళి ప‌నుల్లో ప‌డిపోయింది. ఇప్పుడు రామాయ‌ణం చిత్రంలో హృతిక్ రాముడు  పాత్ర ధ‌రించ‌డంతో దీపిక సీత పాత్రలో న‌టించ‌డానికి మ‌క్కువ చూపుతుంది.  బ‌హుశా ఆ పాత్ర కోసం దీపిక ప‌దుకొనే ప్రేక్ష‌కుల‌ను ఈ విధంగా క‌నువిందు చేసింద‌ని నెటిజ‌న్లు అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: