'మనిషి' అడవిలో ఉన్నప్పుడు కనిపెట్టిందే 'పెళ్లి'.. అలాంటి పెళ్లి  మీద  నాకు గౌరవం లేదని.. ఓ సినిమాలో  హీరో ఆవేశంగా డైలాగ్ చెప్పేస్తాడు. అందుకు తగ్గట్లుగానే నేటి సమాజంలో  అవివాహితులుగా ఉండేవారి సంఖ్య  రోజురోజుకి  ఎక్కువైపోతుంది.  పెళ్లి చేసుకుని బాధ్యతల్లో కూరుకుపోవడం కన్నా, స్వేచ్ఛగా జీవించడానికే ఎక్కువ మంది ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ విషయంలో ప్రముఖులు సైతం ఆసక్తి కనబరుస్తుండటం విశేషం. ఇంతకీ ఇప్పుడు ఈ పెళ్లి గోల ఎందుకంటే.. గత రెండు రోజులుగా  సోషల్ మీడియాలో యంగ్  రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి పై అనేక రూమర్స్ ను వండి వడ్డిస్తున్నారు రాతల రాయుళ్లు.  అందులో భాగంగా  అమెరికాకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నారని.. ఇప్పటికే ఇద్దరు కుటుంబ సభ్యులు సంప్రదింపులు కూడా జరుపుకున్నారని.. పెళ్లి 'సాహో' విడుదల తరువాత ఉండబోతుందని ఇలా అనేక వార్తలు వస్తున్నాయి.  అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వార్తలన్నీ ఒట్టి పుకార్లే అని తేలింది. 


ప్రభాస్ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో  అనేక వార్తలు రావడంతో పాటు  మీడియాలో కూడా  క‌థ‌నాలు రావడంతో ప్రభాస్ సన్నిహితులు ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని ఓ ప్రముఖ మీడియా సంస్థకు చెప్పినట్లు తెలుస్తోంది.   ప్ర‌భాస్ పెళ్లి గురించి ఆ మధ్య  రెబల్ స్టార్  కృష్ణంరాజు స్పందిస్తూ.. 'ప్ర‌భాస్ చిన్న‌పిల్లాడు కాదు కదా   పదేపదే  పెళ్లి చేసుకోమని చెప్ప‌డానికి.  అయినా నేను పెళ్లి విషయంలో ప్రభాస్ ను  ఎప్ప‌టిక‌ప్పుడు  తొందర పెడుతూనే ఉంటానని,  మా మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా  త్వ‌ర‌లోనే చేసుకుంటానని  ప్రభాస్ చెబుతూ ఉన్నాడని  కృష్ణం రాజు చెప్పుకొచ్చారు. దీని బట్టి పెళ్లి విషయంలో ప్రభాస్ దే  తుది నిర్ణయం అని తేలిపోయింది. అయితే ప్రభాస్ మాత్రం ఇప్పట్లో పెళ్లి పట్ల సముఖంగా లేడట. 


కానీ మీడియా మాత్రం ప్రభాస్ పెళ్లి పై  అత్యుత్సాహమే చూపిస్తోంది. దీనికి తోడు ఆ మధ్య  ప్రభాస్ అనుష్కను  పెళ్లిచేసుకోబోతున్నారనే వార్త  కూడా  బాగా వైరల్ అయింది. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా  'సాహో' విడుదలైన తర్వాత  ప్రభాస్ అమెరికాకు చెందిన యువతని వివాహం చేసుకోబోతున్నారని వస్తోన్న వార్త కూడా పూర్తిగా ఫేక్ నట.  ఇక పెళ్లి గురించి ఇటీవలే స్పందించిన ప్రభాస్  ‘అది నా వ్యక్తిగత విషయం అని.. దాని గురించి మాట్లాడటం తనకు ఇష్టంలేదని..  అయినా తను  పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మీడియాకు చెబుతానని’ ప్రభాస్ చెప్పుకొచ్చాడు.  ఏమైనా ప్రభాస్ పెళ్లి విషయంలో  అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఏది నమ్మలేం. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: