ద‌ర్శ‌క‌న‌టుడు.. న‌ట‌గురువు దేవ‌దాస్ క‌న‌కాల (75) అనారోగ్యంతో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే.(శ‌నివారం) ఉదయం కొండాపూర్ కిమ్స్ నుంచి మణికొండ మర్రిచెట్టు స‌మీపంలోని ఆయ‌న‌ స్వ‌గృహానికి పార్థీవ దేహాన్ని తీసుకొచ్చారు. అనంత‌రం హైద‌రాబాద్ మ‌హాప్ర‌స్థానంలో దహన సంస్కరాలు పూర్తి చేశారు. తనయుడు రాజీవ్ కనకాల అంత్యక్రియలను పూర్తి చేశారు.


నటుడు రాజీవ్ కనకాల తండ్రి.. స్టార్ యాంకర్ సుమ కనకాల మామగారు దేవదాస్ కనకాల కన్నుమూసారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన తుదిశ్వాస విడిచారు. ఈయన నటుడిగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలను, నటులను పరిచయం చేసిన నటగురువు దేవదాస్. ఈయన పేరుతో ఓ యాక్టింగ్ స్కూల్ ఉంది. అక్కడే ఎందరో నటులు శిక్షణ తీసుకున్నారు. ఈయనతో ట్రైనింగ్ తీసుకున్న వాళ్లలో గొప్పగొప్ప నటులు కూడా ఉన్నారు.


న‌ట‌గురువు క‌న‌కాల మృతి ప‌ట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఆయ‌న‌ పార్థీవ దేహాన్ని సంద‌ర్శించుకున్న అనంత‌రం క‌న‌కాల‌ కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. నాటక రంగం నుండి సినిమా రంగంలోకి ప్ర‌వేశించిన దేవదాస్ కనకాల టాలీవుడ్ లో ఎంద‌రో న‌టీన‌టుల్ని తీర్చిదిద్దారు. చిరంజీవి, రాజేంద్రప్రసాద్ త‌దిత‌రుల‌కు ఆయ‌న న‌ట‌న‌లో శిక్ష‌ణ‌నిచ్చారు.  రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, ప్రదీప్ శక్తి, భానుచందర్‌, అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, రఘువరన్ వంటి నటులతో పాటు ఇంకా చాలా మంది ఆయన నట పాఠశాలలో శిక్షణ తీసుకున్న వాళ్లే. 1945లో జూలై 30న యానంలో జన్మించారు. దేవదాసు స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట. విశాఖపట్టణంలోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ చదివారు.




మరింత సమాచారం తెలుసుకోండి: