జయం రవి హీరోగా ప్రదీప్ రంగనాథన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కొమాలి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్ 16 ఏళ్లు కోమాలో ఉండి బయటపడ్డ హీరో ప్రపంచం ఎలా మారిందో చూసి షాక్ అవుతాడు. మంచి కథ దానికి తగినట్టుగా ఫన్ సినిమాకు మంచి స్కోప్ దొరికింది. ఇక జయం రవి, యోగి బాబుల కామెడీ అదిరిపోయింది. 


16 ఏళ్లు కోమాలో ఉండి బయటకు వచ్చిన ఓ హీరో కథే కొమాలి. డిఫరెంట్ అటెంప్ట్ గా ఉన్న ఈ సినిమాను దర్శకుడు ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. సినిమాలో జయం రవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. కేవలం కామెడీ మాత్రమే కాదు ట్రైలర్ సెకండ్ హాఫ్ లో కావాల్సినంత ఎమోషన్ ఉందని చూపించారు.   


ఫైనల్ గా కొమాలి ట్రైలర్ ఆకట్టుకుంది. జయం రవి ఈ సినిమాతో హిట్ కొట్టేలా ఉన్నాడు. కాజల్ కూడా ఈ సినిమాతో మళ్లీ కోలీవుడ్ లో మంచి ఫాంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ట్రైలర్ తో సూపర్ బజ్ ఏర్పరచుకున్న ఈ కొమాలి రిలీజ్ తర్వాత ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి. ఆగష్టు 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగులో డబ్ చేస్తారో లేక రీమేక్ చేస్తారో చూడాలి. 


తమిళ సినిమా ట్రైలర్ బాగుందంటే చాలు మన దర్శక నిర్మాతలు ఆ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకుంటారు. మరి కొమాలి రీమేక్ చేస్తారా లేక డబ్ చేసి రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి. సినిమా మొత్తం చెన్నైలో ఉంది కాబట్టి సినిమా రీమేక్ చేసి మన తెలుగు నేటివిటీకి మార్చితే బాగుంటుంది. ట్రైలర్ చూసి కొమాలి తెలుగు వర్షన్ హీరో ఎవరైతే బాగుంటుందో మీరు కామెంట్స్ రూపంలో తెలుపండి.



మరింత సమాచారం తెలుసుకోండి: