ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరి జగన్నాథ్ మరియు ఎనర్జిటిక్ స్టార్, రామ్ ల కలయికలో రూపొందిన లేటెస్ట్ సినిమా ఇస్మార్ట్ శంకర్, సూపర్ హిట్ టాక్ మరియు కలెక్షన్ తో ప్రస్తుతం ముందుకు సాగుతోంది. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని హీరో రామ్, అలానే దర్శకుడు పూరి జగన్నాథ్ లకు ఈ సినిమా సూపర్ హిట్ మంచి జోష్ ని ఇచ్చిందనే చెప్పాలి. పక్కా మాస్ మరియు కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో ఎన్నో ఏళ్ల తరువాత పూరి మార్క్ డైలాగ్స్ కు థియేటర్స్ లో ఆడియన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక హీరో రామ్ ఫైట్స్ మరియు డాన్స్ మూమెంట్స్ లోని ఆయన ఎనర్జీ, మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన వండర్ ఫుల్ సాంగ్స్ , అదరగొట్టే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వెరసి ఈ సినిమా విజయబావుటాను ఎగుర వేసింది. 

ఇక సినిమాలోని ఇద్దరు హీరోయిన్లు, తమ క్యారెక్టర్ల  పరిధి మేరకు ఎంతో బాగా నటించి ఆడియన్స్ మనసు గెలుచుకున్నారు. ఇప్పటికే రూ.77 కోట్లవరకు గ్రాస్ కలెక్షన్ సంపాదించిన ఈ సినిమా, మన తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా మంచి కలెక్షన్ తో దూసుకెళుతోంది. మరీ ముఖ్యంగా బి మరియు సి సెంటర్ల ప్రేక్షకులు ఈ సినిమాను మరింతగా ఆదరిస్తున్నారని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులతో పాటు కొందరు సినిమా ప్రముఖులు సైతం ప్రశంశలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే నేడు ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇస్మార్ట్ హీరో రామ్, మరియు దర్శకుడు పూరిలతో కలిసి ప్రత్యేకంగా వీక్షించినట్లు సమాచారం. సినిమా చూసిన అనంతరం, మహేష్ బాబు మాట్లాడుతూ, సినిమా సూపర్బ్ గా ఉందని, పూరి గారు ప్రతి ఫ్రేమ్ కూడా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని, మళ్ళి  చాలా కాలం తరువాత ఆయన మంచి ఫామ్ లోకి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని మెచ్చుకున్నారట. 

అయితే మహేష్ మాటలకు పూరి షాకైనట్లు చెప్తున్నారు, ఎందుకంటే తనతో మహేష్ కేవలం హిట్స్ లో ఉన్నపుడే సినిమా చేస్తారు అని ఇటీవల ఆయన స్వయంగా మహేష్ పై సంచలన కామెంట్స్ చేసినప్పటికీ కూడా, మహేష్ బాబు తమ సినిమాపై ఈ విధంగా పొగడ్తలు కురిపించడంతో కొంత ఆశ్చర్యపోయారట. ఇక మహేష్ బాబు, హీరో రామ్ సహా ఇస్మార్ట్ యూనిట్ మొత్తాన్ని సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించడం జరిగిందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఇక ప్రస్తుతం విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజముందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే నేటి ఉదయం, హీరో రామ్ మరియు మహేష్ బాబు కలిసి దిగిన ఒక ఫోటో పలు మీడియా మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుండడంతో మహేష్ బాబు ఇస్మార్ట్ శంకర్ చూసారని అంటున్నారు. అయితే ఈ విషయమై పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: