తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న నటులకు కొదవలేదు. వారిలో కమెడియన్లు కూడా ఉన్నారు. కమెడియన్లుగా మంచి పేరు తెచ్చుకున్న వాళ్లు తరువాత హీరోలుగా ట్రై చేసి కలిసిరాక మళ్లీ కమెడియన్లుగా రాణించిన వాళ్లూ ఉన్నారు. అలా కాకుండా మళ్లీ కామెడీ ట్రాక్ పట్టలేక అడపాదడపా రాణిస్తున్నవారూ ఉన్నారు.


 

సీనియర్ కమెడియన్ సుధాకర్ కెరీర్ మొదట్లో తమిళ్ లో హీరోగా చేశాడు. తారువాత తెలుగులో స్టార్  కమెడియన్ గా చక్రం తిప్పాడు. బ్రహ్మానందం, బాబూమోహన్, ఆలీ కూడా కమెడియన్లుగా స్టార్ స్టేటస్ అనుభవిస్తూనే హీరోలుగా పలు సినిమాలు చేశారు. కానీ హీరోలుగా నిలదక్కుకోలేక మళ్లీ కమెడియన్లుగా ఇండస్ట్రీని ఏలేశారు. ఆలీకి యమలీల, పిట్టలదొర వంటి భారీ హిట్స్ ఉన్నా తరువాత ఫ్లాపులు రావడంతో మళ్లీ కమెడియన్ అయిపోయాడు. బ్రహ్మానందం తరువాత ఆ స్థాయి స్టార్ కమెడియన్ గా ఎదిగిన సునీల్ ది ఇదే పరిస్థితి. హీరోగా చాలా సినిమాలు చేసినా అందాలరాముడు, మర్యాదరామన్న తప్ప అన్నీ ఫ్లాపులే. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా సునీల్ స్ట్రాంగ్ కమెడియన్ కెరీర్ అక్కడితో అయిపోయింది. ఇప్పుడు సప్తగిరి, షకలక శంకర్ కమెడియన్లుగా పేరు తెచ్చుకుని హీరోలుగా ట్రైచేస్తున్నారు. కానీ వీరి హీరో కెరీర్ కూడా అంత సాఫీగా ఏం సాగడంలేదు. కమెడియన్లుగా ఇచ్చిన ప్రెసెన్స్ హీరోలుగా ఇవ్వలేకపోతున్నారు.


 

కమెడియన్లుగా రాణిస్తూ హీరోలుగా ట్రై చేయడం తప్పేమీ కాదు కానీ వాళ్లకు కెరీర్ ఇచ్చిన కామెడీని వదిలేయడమే ప్రేక్షకులకు లోటు. వారిని హీరోలుగా చూశాక మళ్లీ కమెడియన్లుగా క్యారెక్టర్లు ఇవ్వలేకపోతున్నారు డైరక్టర్లు. ఇచ్చినా వాళ్లు తమ స్థాయి కామెడీ చేయలేకపోతున్నారు. కమెడియన్లు ఎక్కువగా ఉండే టాలీవుడ్ లో కామెడీ తక్కువ కాకూడదు. కమెడియన్లు ఆ దిశగా ఆలోచిస్తే ప్రేక్షకులను మరింత ఫన్ అందుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: