నాగార్జున హీరోగా చేసిన మన్మధుడు 2 మూవీ ఆగష్టు 9 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.  ఈరోజు ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.  ప్రీ రిలీజ్ ఒకెత్తయితే.. ఇందులో ఓ లుక్ ను రిలీజ్ చేశారు.  అది మరొక ఎత్తు.  ప్రీ రిలీజ్ వేడుకలో నాగ్ కు సంబంధించిన ఓ సీక్రెట్ లుక్ ను రిలీజ్ చేశారు.  ముసలితనంలో నాగార్జున తలపాగా కట్టుకొని, పెద్దపెద్ద మీసాలతో కనిపించాడు. ఈ సినిమాలో ఆ లుక్ దేనికోసం అనే దానిగురించి అంతా చర్చించుకుంటున్నారు.  లుక్ పరంగా చాలా బాగుంది.  


అయితే, సినిమాలో ఆ లుక్ ఎప్పుడు వస్తుంది.. ఆ లుక్ కు సినిమాకు సంబంధం ఏంటి.. సమంత పాత్ర ఎక్కడ ఉంటుంది.  కీర్తి సురేష్ పాత్ర ఏమిటి.. దాంతోపాటు నాగ్ చేతిమీతున్న టాటూకు దీనిగురించి అనే చాలా విషయాలను సస్పెన్స్ లో పెట్టారు.  ఇలా సస్పెన్స్ లో పెట్టి ఇరకాటంలో పెట్టారు.  సస్పెన్స్ లోపెట్టడం వలన సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది.  సినిమాలో రొమాంటిక్ యాంగిల్ ఒక రకంగా చూపిస్తూ.. ఇన్ని వేరియేషన్స్ చూపించడం వలన సినిమాను ఎలా నడిపిస్తున్నారో అర్ధంగాని విషయంగా మారింది.  


అయితే, కొంతమంది అభిప్రాయం ప్రకారం ఈ సినిమాకు మరో సీక్వెల్ చేసేందుకు అనుగుణంగా ఆ లుక్ ను క్రియేట్ చేశారని, మన్మథుడు3 సినిమాను కూడా త్వరలోనే ప్లాన్ చేస్తారని అంటున్నారు.  ఒకవేళ మన్మథుడు 3 సినిమాను ప్లాన్ చేస్తే ఎవరితో చేస్తారు.. నాగార్జునను ఆ గెటప్ లో చూపించి... నాగచైతన్య, అఖిల్ లతో కలిపి సినిమా చేస్తారా లేదంటే.. అఖిల్ ను మన్మథుడిగా చూపిస్తారా అన్నది తెలియాలి.  ఈ సినిమా హిట్టయితే... రాహుల్ కు అక్కినేని ఫ్యామిలీ డైరెక్టర్ గా మారతాడు అనడంలో సందేహం అవసరం లేదు.  నెక్స్ట్ సినిమా రాహుల్ నాగచైతన్యతో చేస్తారని వార్తలు వస్తున్నాయి.  ఈ వేడుకలో సమంత, అఖిల్ కూడా ఉండి ఉంటె ఆ వేడుకకు కళ వచ్చి ఉండేది.  


మరింత సమాచారం తెలుసుకోండి: