బాలీవుడ్ ఐటెం సాంగ్ గర్ల్ రాఖీసావంత్ పెళ్లి చేసుకున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని గతంలో బుకాయించింది.  కేవలం వెడ్డింగ్ ఫోటో షూట్ కోసమే ఆ డ్రెస్ వేసుకున్నట్టు చెప్పింది.  సరే అంతవరకు బాగానే ఉన్నది.  ఆ విషయాన్ని నెటిజన్లు అప్పటితో మరిచిపోయారు.  రాఖీ అక్కడితో ఆగకుండా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది.. చేతికి గాజులు, మెహందీ తలపై సింధూరం పెట్టుకున్న ఫోటోలను షేర్ చేసింది.  ఆ ఫోటోలు చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది.. పెళ్లి చేసుకుందేమో అనిపిస్తుంది కదా.  



అంతేనా ఆ తరువాత మరో ఫోటో షేర్ చేసింది. అది హనీమూన్ ఫోటో.  నైట్ గౌన్ లో చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని ఉన్న ఫోటో.  ఇంకేముంది విషయం బయటకు గుప్పుమంది.. రాఖీ సావంత్ పెళ్లి చేసుకుంది.. విషయాన్ని దాచిపెట్టింది అనే సోషల్ మీడియా కోడై కూయడంతో రాఖీ ఒప్పుకోక తప్పలేదు.  పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించింది.  తనకు పెళ్లయిందని.. అయితే ఆ విషయాన్ని బయటపెట్టేందుకు భయపడ్డానని చెప్పింది.  తనను పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు రితేష్ అని.. యూకే లో ఉంటాడని చెప్పింది.  



ప్రభుచావ్లాతో చేసిన ఇంటర్వ్యూ సమయంలో రితేష్ తనను చూశాడని.. అప్పుడు అతను తన అభిమాని అని, ఆ తరువాత స్నేహంగా మారిందని, ఇప్పుడు పెళ్లి వరకు వచ్చిందని చెప్పింది. పెళ్లి తరువాత రితేష్ యుకే వెళ్ళాడట.  తనకు ఇంకా వీసా రాలేదని, వచ్చాక అక్కడే ఉంటానని చెప్పింది.  తనకు టీవీ షోలు చేయాలనీ ఉందని ఇకపై ఆ షోను చేసేందుకు రెడీ అవుతానని చెప్తోంది రాఖీ సావంత్.  అయితే, తన భర్త రితేష్ ఫోటోలను మాత్రం బయటపెట్టలేదు. 



యూకేలో రితేష్ ఏం చేస్తాడో చెప్పలేదు.  పోనీలే.. పెళ్ళైతే అయ్యిందని ఊపుకుంది.  పెళ్లి విషయం దాటడం వలన వచ్చిన ఉపయోగం ఏంటో.. వచ్చే నష్టం ఏంటో రాఖీకే తెలియాలి.  అదేమీ నేరం కాదుకదా.  అందరు పెళ్లిని హ్యాపీగా చేసుకుంటే.. రాఖి ఎందుకని అలా సీక్రెట్ గా చేసుకోవాల్సి వచ్చిందో ఆమెకే తెలియాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: