శర్వానంద్ కథానాయకుడిగా కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ కథానాయకలాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రణరంగం'. 1980లో మొదలైన కథ నుండి నేటి వరకు సాగే ఓ గ్యాంగ్‌స్టర్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఆగష్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్బంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.                                                          


ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ట్రైలర్‌ను కాకినాడలో దర్శకుడు త్రివిక్రమ్ చేతుల మీదగా విడుదల చేశారు. శర్వానంద్, కల్యాణి ప్రియదర్శన్ కథతో ప్రారంభమైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా, అద్భుతంగా ఉంది. ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్ మహాల్ కట్టాడనుకుంటే డబ్బులెక్కువై అనుకున్నా కానీ కొంత మంది కోసం కట్టొచ్చు, ఖర్చు పెట్టొచ్చు అంటూ ట్రైలర్ ప్రారంభమైంది. 


1980లో మద్యపానం నిషేధం తర్వాత తాగేవారి కోసం సముద్రం ద్వారా మందును స్మగ్లింగ్ ద్వారా తెప్పించుకునే సన్నివేశాల నుంచి 40 ఏళ్ళు విదేశాల్లో ఉండే హీరోకు కాజల్ అగర్వాల్ పరిచయం వరుకు కొన్ని సన్నివేశాలను ట్రైలర్ లో చూపించి,  మూడో ప్రపంచ యుద్ధం నీళ్ల కోసం అంటే నమ్మలేదు కానీ ఇప్పుడు నమ్మక తప్పడం లేదు అంటూ హీరో విలన్స్‌తో చెప్పే డైలాగ్స్‌తో ట్రైలర్ ముగుస్తుంది. క్షణ క్షణం ఉత్కంఠంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది రణరంగం ట్రైలర్. కాగా ఈ సినిమాకు ప్రశాంత్ పిళ్లై సంగీతం అందించారు. ఆగష్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: