శర్వానంద్ రణరంగం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న కాకినాడలో జరిగింది. ఈ ఈవెంట్ కోసం శర్వానంద్ రాజమండ్రి మీదుగా కాకినాడ వెళ్ళడానికి హైదరాబాద్ నుండి బయలుదేరాడు. అయితే అక్కడ అదేవిమానంలో రాజమండ్రికి తనతోపాటు ప్రయాణం చేస్తున్న పవన్ కళ్యాణ్ ను చూసిన వెంటనే శర్వానంద్ ఆనంద పడటమే కాకుండా పవన్ ను పలకరించి తన ‘రణరంగం’ సినిమా ఫంక్షన్ విషయాలను తెలియచేసాడు.

పవన్ కళ్యాణ్ కూడ శర్వానంద్ పట్ల అభిమానం చూపెడుతూ అతడికి జరిగిన యాక్సిడెంట్ విషయాలను అడగటమే కాకుండా ‘రణరంగం’ మూవీ సూపర్ సక్సస్ అవ్వాలని ఆకాంక్షించాడు. వీరిద్దరూ ఒకే ఎయిర్ పోర్ట్ బస్సులో పక్కపక్కనే ఉన్న  ఫోటోలను ఒక వీరాభిమాని తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో శర్వానంద్ అభిమానులు ‘రణరంగం’ కు పవన్ ఆశీస్సులు లభించాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇది ఇలా ఉండగా నిన్న సాయంత్రం కాకినాడలో జరిగిన ‘రణరంగం’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు జనం విపరీతంగా వచ్చారు. త్రివిక్రమ్ అల్లు అర్జున్ లు అతిధులుగా ఈ ఫంక్షన్ కు రావడంతో బన్నీ అభిమానులు అనేకమంది ఈ ఫంక్షన్ కు రావడంలో ఈ ఫంక్షన్ అత్యంత కోలాహలంగా జరిగింది. 

ఈమూవీకి సంబంధించిన ట్రైలర్ కూడ బాగా కనక్ట్ అయింది. గతంలో నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ పై బ్యాన్ పెట్టినప్పుడు చలరేగిపోయిన మాఫియా సంఘటనలు ఆధారంగా తీసుకుని ఈమూవీని నిర్మించినట్లు అర్ధం అవుతోంది.  ముఖ్యంగా ఈమూవీలో శర్వానంద్ డాన్ అవతారంలో కనిపించడంతో ఈమూవీ పై అంచనాలు పెరుగుతున్నాయి. ‘పవర్ ఉంటే సరిపోదు ఏది ఎవరి మీద ఎలా చూపించాలో కూడ తెలుసుకోవాలి’ లాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ ఈమూవీ ట్రైలర్ లో కనిపిస్తున్న నేపధ్యంలో ఈమూవీ గ్యారెంటి హిట్ అంటూ ప్రచారం మొదలైంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: