చూడడానికి చక్కగా, ఎర్రగా కనిపిస్తూ చాకోలేట్ బాయ్ అని పేరు తెచ్చుకున్న హీరో మహేష్ బాబు సినిమాల్లో దానికి పూర్తి విరుద్దంగా అదిరిపోయే ఫైటింగ్స్ తో అందరిని బెంబేలెత్తేస్తాడు. వావ్.. మహేష్ పవర్ అని అనిపిస్తాడన్నది అందరికి తెలిసిందే. అలాంటి అదిరిపోయే బాదుడును శుక్రావారం నుంచి మహేష్ బాబు ప్రారంభించాడు. అది కూడా మన రాష్ట్రంలో కాదు, మంగ్లూర్ బీచ్ లో. మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమా తీస్తున్నాడన్న విషయం అందరికి తెలుసు కదా. ఈ సినిమాలోని ఫైటింగ్ సీన్ల చిత్రీకరణ ఈ బీచ్ లో శుక్రవారం నుంచి మొదలు పెట్టారు. సుకుమార్ దర్శకత్వంలో ఎన్నో భారీ అంచనాల మద్య ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. దీనిలో మహేష్ సరసన క్రితి సనన్ నటించింది. ఈ సినిమా సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: