ఫ్యామిలీ సినిమాల హీరోగా ఒకప్పుడు ఒక వెలుగువెలిగిన జగపతి బాబు ఆతరువాత పూర్తిగా తన ప్రాభవం కోల్పోయాడు. అదృష్టం కలిసి వచ్చి ‘లెజెండ్’ సినిమాతో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు ఇప్పుడు దక్షిణ భారత సినిమా రంగంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న విలన్ పాత్రధారి ఇప్పుడు జగపతి బాబు పారితోషికం రోజుకు 5 లక్షల స్థాయిలో ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. 

ఇలాంటి పరిస్థితులలో జగపతి బాబు లేటెస్ట్ గా గోవాలోని బిగ్ డాడీ కాసినోలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోను జగపతి బాబు స్వయంగా తన ట్విటర్ పేజ్ లో షేర్ చేయడమే కాకుండా ‘నన్ను విష్ చేయండీ’ అంటూ చేసిన ట్విట్ సంచలనంగా మారింది. గతంలో జగపతి బాబుకు అవకాశాలు బాగా తగ్గినప్పుడు కాసినో లకు తరుచు వెళుతూ అదేవిధంగా పేకాట ఆడటం వల్ల తన ఆస్థులను పోగొట్టుకున్నాడు అన్న ప్రచారం కూడ జరిగింది. అయితే అలాంటి ప్రచారాన్ని జగపతి బాబు అప్పట్లో ఖండించాడు. 

తన సన్నిహితులు కొందరు తనను మోసం చేయడం వల్ల చెత్త సినిమాలు చాల నటించడం వల్ల తాను నష్టపోయాను కాని తన కాసినో సరదాలు వల్ల కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. అయితే జగపతి బాబుకు అప్పట్లో ఏర్పడ్డ మచ్చ అలాగే కొనసాగుతోంది. 

ఈ విషయాలను జగపతి బాబు ఏమాత్రం పట్టించుకోకుండా ఏకంగా గోవా వెళ్ళి తనకు బాగా ఇష్టమైన బిగ్ డాడీ కాసినోలో కాలం గడపడానికి సంబంధించిన ఫోటోలు చూసి జగపతి బాబు అభిమానులు భయపడిపోతున్నారు. ఫిలిం ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి బాగా డిమాండ్ మీద ఉన్న జగపతి బాబు మనసు ఇప్పుడు కాసినోల పైకి వెళ్ళడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: