ఈవారం విడుదల కాబోతున్న ‘మన్మధుడు 2’ మూవీ పై ప్రీ పాజిటివ్ టాక్ ఉన్న నేపధ్యంలో ఈమూవీకి మరింత క్రేజ్ తీసుకు రావడానికి నాగార్జున తన సర్వ శక్తులను ఉపయోగించి ఈమూవీని చాల గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. నాగార్జున కెరియర్ లో ఇప్పటివరకు అతడి సినిమాలకు 50 కోట్ల నెట్ కలక్షన్స్ స్థాయిని మించి రాకపోవడంతో తన షష్టిపూర్తి సమయంలో తన డ్రీమ్ కలక్షన్స్ టార్గెట్ మూవీగా ‘మన్మధుడు 2’ మూవీని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాడు.

నిన్న జరిగిన ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగ్ మాట్లాడుతూ తనకు అందరు అనుకుంటున్నట్లుగా తనకు ఇద్దరు కొడుకులు లేరని కేవలం తనకు నాగచైతన్య అఖిల్ లు తమ్ముళ్ళు మాత్రమే అని కామెంట్ చేయడం మరీ అతిగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నాగార్జున తన వయసు బయటపడకుండా తన మేకప్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అతడి మొఖంలో గ్లో తగ్గింది అన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. 

దీనితో తన లుక్ పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ను కవర్ చేసుకోవడం కోసం యంగ్ హీరోలతో సమానంగా లిప్ లాక్ సీన్స్ లో నటించడం తనకు పిల్లలే లేరు అంటూ జోక్ చేయడం నాగ్ మితిమీరిన ఆత్మ విశ్వాసానికి నిదర్శనంగా మారింది అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. దీనికితోడు ఈ ఏడాది చైతన్య ‘మజిలీ’ మూవీ కలక్షన్స్ రికార్డులు సమంత ‘ఓ బేబి’ కలక్షన్స్ రికార్డులు తన ‘మన్మధుడు 2’ తో తుడిచిపెట్టుకు పోతాయి అంటూ నాగ్ కామెంట్స్ చేయడంతో ఈమూవీ ఫలితంలో తేడా కొడితే నాగ్ శపధం ఏమైపోతుంది అంటూ మరికొందరు కామెంట్స్ చేసుకుంటున్నారు.

దీనితో ‘మన్మధుడు 2’ పై నాగ్ ప్రేక్షకులలో అనవసరమైన అంచనాలు పెంచేస్తున్నాడు అన్న వాదన కూడ వినిపిస్తోంది. ‘డియర్ కామ్రేడ్’ మూవీ ఫ్లాప్ కు ఆమూవీ పై పెరిగిపోయిన అంచనాలే ప్రధాన కారణం. అంచనాలు లేకుండా ‘డియర్ కామ్రేడ్’ విడుదలై ఉంటే ఆమూవీకి అలాంటి పరిస్థితి ఏర్పడి ఉండేది కాదు అని అంటున్నారు. ఇలాంటి ఉదాహరణలు తన కంటి ముందు కనిపిస్తున్నా నాగ్ ‘మన్మధుడు 2’ విషయంలో మితిమీరిన అంచనాలు ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: