మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన చిరంజీవి గారిని ఒక ప్రముఖ పత్రిక కోసం ఇంటర్వ్యూ చేసిన సమయంలో చిరంజీవి తన జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను గురించి చెప్పారు. హైదరాబాద్ లోని ఒక ఫేమస్ హోటల్ లోని మెనూలో చిరు దోసె అనే రెసిపీ ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఆ దోసెను ఎంతో ఇష్టంగా తింటారు. ఆ దోసెకు చిరు దోసె అని పేరు పెట్టటానికి, ఆ దోసె వెనుక ఉన్న కథను చిరంజీవి చెప్పారు. 
 
ఒకసారి చిక్ మంగళూరులోని ఒక చిన్న హోటల్ లో చిరంజీవి గారు ఒక దోసెను తిన్నారు. ఆ దోసె ఎంతో రుచికరంగా ఉండటంతో ఆ దోసెను తయారు చేసిన విధానం చెప్పమని ఆ హోటల్ యజమానిని అడిగాడట చిరంజీవి. దానికి సమాధానంగా ఆ హోటల్ యజమాని ఆ రెసిపీ తమ సాంప్రదాయక వంటకమని చెప్పి ఆ దోసె తయారు చేసే విధానం చెప్పటానికి మాత్రం ఇష్టపడలేదు. 
 
ఆ హోటల్ యజమాని చెప్పకపోయినప్పటికీ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి దోసెలతో రకరకాల ప్రయోగాలు చేశారు. అలా చేసిన ప్రయోగాల్లో మొదట అనుకున్న ఫలితాలు రానప్పటికీ తరువాత మాత్రం చిక్ మంగళూర్ దోసె కంటే మరింత రుచితో కూడిన దోసె తయారు అయిందట. అలా తయారు చేసిన దోసెకు నూనె అవసరం లేదని జయసుధ, ప్రభుదేవా మరికొంతమంది సెలబ్రిటీలు ఆ దోసె తినటం కోసం ఇంటికి వచ్చేవారని చిరంజీవి చెప్పాడు. 
 
ఛట్నీస్ రెస్టారెంట్ ఓనర్ చిరంజీవి గారి ఇంటికి వచ్చినపుడు దోసె తిన్నారని దోసె చాలా బాగా నచ్చటంతో వారి హోటల్ మెనూలో ఈ దోసె పెట్టుకుంటామని అడిగారని అందుకు సరేనని చెప్పి చెఫ్ ద్వారా ఆ దోసె తయారు చేయించడానికి శిక్షణ ఇప్పించానని చిరంజీవి చెప్పారు. ఆ దోసెకు ఛట్నీస్ హోటల్ వారు మెనూలో చిరు దోసె అనే పేరు పెట్టారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: