టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ సినిమాగా కొన్నాళ్లక్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా సూపర్ హిట్ ని సొంతం చేసుకుని ఆయన స్టామినా ఇంకా తగ్గలేదని మరొక్కసారి రుజువు చేసింది. ఇకపోతే ఆ సినిమా తరువాత ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి సినిమా, ఇటీవలే షూటింగ్ ని పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధం అవుతోంది. సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక దాని అనంతరం, కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ త్వరలో ఒక సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. 

ఈ సినిమా కోసం మెగాస్టార్ చాలావరకు తన శరీర బరువును తగ్గించుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఇటీవల ఆయన కొంత ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఎంతో స్లిమ్ గా తయారైన మెగాస్టార్, కొద్దిరోజుల క్రితం ఒక జాతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో ఆయనపై ఫోటో షూట్ కూడా నిర్వహించారు. ఆ ఫోటో షూట్ లో లేటెస్ట్ ట్రెండీ స్టైల్ అవుట్ ఫీట్స్ లో దర్శనమిచ్చిన మెగాస్టార్ ని, చూసిన వారందరూ ఎంతో ఆశ్చర్యపోతున్నారు. మెగాస్టార్ కు రోజులు గడుస్తున్నకొద్దీ వయసు పెరగడం కాదు తగ్గుతోందని, ఆయన్ని చూస్తుంటే ఒకప్పటి మెగాస్టార్ మాకు గుర్తుకు వస్తున్నారని అంటున్నారు. 

ఇక కొందరు సినిమా ప్రముఖులు అయితే, వావ్ మెగాస్టార్ గారు, మిమ్మల్ని చూస్తుంటే మీ ఒకప్పటి సినిమాలు మాకు గుర్తుకు వస్తున్నాయి, అందుకే మీరు అంత గొప్ప మెగాస్టార్ అయ్యారు అంటూ ఆయన లేటెస్ట్ ఫొటోస్ పై తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిప్రాయపడుతున్నారు. ఇక నిన్నటినుండి మెగాస్టార్ ఫోటోలు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ స్టయిలిష్ లుక్ లోనే ఆయన కొరటాల శివ సినిమాలో నటిస్తుండడంతో, రేపు సినిమా షూటింగ్ పూర్తి అయి థియేటర్స్ లోకి వచ్చాక, మెగాస్టార్ ని చూసిన ఫ్యాన్స్, సంబరాలు చేసుకోవడం కూడా ఖాయంగా కనపడుతోందని అంటున్నారు సినీ విశ్లేషకులు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: