ఫ్రెండ్ షిప్ అనేది ఎలా మొదలవుతుందో ఎవ్వరికీ తెలియదు. కొన్ని స్నేహాలు మధ్యలో మొదలయ్యి మధ్యలోనే దూరమవుతాయి. కానీ చిన్నప్పుడు మనతో ఆడుకున్న స్నేహితులు, కాలేజీలో మనతో దోస్తీ కుదిరే దోస్తులు ఎప్పటికీ ఒకేలా ఉంటారు. సాధారణంగా ఇటువంటి స్నేహాలే ఎక్కువకాలం నిలబడతాయి. ఎందుకంటే ఆ స్నేహంతో మనకి ముడిపడి ఉన్న జ్ఞాపకాలే దానికి కారణం. ఆ జ్ఞాపకాలు ఎంతో మధురమైనవి.


వాటిని ఎప్పుడు గుర్తు చేసుకున్నా మన పెదవుల మీద నవ్వు కదలాడుతుంది. కాలేజీ స్నేహం గురించి చాలా సినిమాలే వచ్చాయి. కాలేజీ స్నేహంలో ఉన్న గొప్పతనాన్ని చూపించిన సినిమాలు ఎన్ని వచ్చినా, ఆ స్నేహం గురించి ఎంత చెప్పినా, ఇంకా చెప్పుకోవడానికి ఎంతో కొంత మిగిలే ఉంటుంది. అందుకే ఆ జోనర్ లో సినిమాలు వస్తూనే ఉంటాయి. ప్రేక్షకులు వాటిని ఆదరిస్తూనే ఉంటారు.


ఇలా కాలేజీ స్నేహం గురించి బాలీవుడ్ లో ఒక చిత్రం తెరకెక్కింది.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా, శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన  "చిచోరే " సినిమా ట్రైలర్ ని  ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఆదివారం లాంచ్ చేశారు. ఈ సినిమాకి బాలీవుడ్ దర్శకుడు "నితీశ్ తివారీ" దర్శకత్వం వహించాడు. ఈ టీజర్ ఆసాంతం చాలా ఆసక్తికరంగా ఉంది. మళ్ళీ మన కాలేజ్ డేస్ ని గుర్తుకు తెచ్చేలా నోస్టాల్జిక్ ఫీలింగ్ కలుగుతుంది.


ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ సినిమా ద్వారా మరో హిట్టు కొట్టేలా కనబడుతున్నాడు. అదీ గాక నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాలీవుడ్ సెలెబ్రిటీలైన ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ ,ఆలియా భట్ ల నుండి టీజర్ బాగుందంటూ ప్రశంసలు దక్కాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: