ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న క్రేజీ మూవీ సాహో. తోలి సినిమా రన్ రాజా రన్ తో మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా విపరీతమైన అంచనాలున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి బయటకు వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్, రెండు వీడియో ప్రోమో సాంగ్స్, సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి తీసుకెళ్లాయి అనే చెప్పాలి. 

ఈ సినిమాతో బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతుండగా, యువి క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, ప్రమోద్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరుగుతోంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోకు ధీటుగా ఉండే విలన్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు సినిమాలో ఆయన క్యారెక్టర్ తాలూకు ఫస్ట్ లుక్ ని కాసేపటి క్రితం సాహో యూనిట్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో రిలీజ్ చేసింది. 

న్యూ స్టైలిష్ లుక్ లో ట్రెండీ స్టయిల్లో కనపడుతున్న నితిన్ ముకేశ్ ని చూస్తే సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే పలు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించిన నితిన్ ముఖేష్ ఈ సినిమాలో కూడా మరింత క్రూరమైన విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రముఖ కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ కూడా ఈ సినిమాలో మరొక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓవర్ అల్ గా రోజురోజుకు ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతూ పోతున్నాయి. అతి త్వరలో ఆడియో రిలీజ్ వేడుకను జరుపుకోనున్న ఈ సినిమా ఈనెల 30వ తేదీన భారీ లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా యూనిట్.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: