కమెడియన్ సునీల్ కు త్రివిక్రమ్ ఎంత క్లోజ్ ఫ్రెండో అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ సినిమాలకు రాయడం మొదలు పెట్టాక సునీల్ కోసం మంచి పాత్రలు క్రియోట్ చేశాడు. దాంతో సునీల్ బాగా పాపులర్ అయ్యాడు. కమెడియన్ గా మంచి ఫాం లో ఉండగానే హీరోగా సినిమాలు చేసే అవకాశం రావడంతో ఆ రకంగాను బాగానే సక్సస్ అయ్యాడు. అయితే కొంతకాలంగా సునీల్ కి హీరోగా అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో మళ్ళీ కమెడియన్ గా చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు. అయితే లేటెస్ట్ గా తెరకెక్కుతున్న బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో సునీల్ కి పాత్ర లేనట్లే తెలుస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ హీరోగా నిలదొక్కుకోలేక, వెనకబడిపోయిన సునీల్ ను మళ్లీ కమెడియన్ గా నిలబెట్టాలని తన అరవింద సమేత సినిమాలో పాత్ర ఇచ్చారు. కానీ అదేమీ పెద్దగా ఫలితం ఇవ్వలేదు.

అదేకాదు, మరోకొన్ని సినిమాల్లో చేసినా సునీల్ కు ఆశించిన ఫలితం దక్కడంలేదు. అందుకు ముఖ్య కారణం సునీల్ లో గతంలోని స్పార్క్, కామెడీ టైం మిస్ అయిందని కామెంట్లు వస్తున్నాయి. అందుకే బన్నీ సినిమాలో మంచి పాత్ర పడితే, మళ్లీ సునీల్ కెరీర్ ముందుకు వెళ్తుందనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేనట్లేనని లేటెస్ట్ న్యూస్. బన్నీ సినిమాలో రావురమేష్ నటించాల్సి వుందన్న విషయం తెలిసిందే. కానీ తను వేరొక సినిమాలో మంచి పాత్ర రావడంతో ఈ సినిమా నుండి తప్పుకున్నారు. అయితే ఆ పాత్రతో పాటు సునీల్ పాత్ర వుండాల్సిందని కానీ రావు రమేష్ లేకపోవడంతో సునీల్ పాత్ర లేపేశారని సమాచారం.

బన్నీ సినిమాకు మొదట్లో కమెడియన్ 30 ఇయర్స్ పృధ్వీ వుంటాడని వార్తలు వచ్చాయి. కానీ పృధ్వీ తరచు పవన్ ను విమర్శించిన నేఫథ్యంలో ఆయన పాత్ర తీసేసారు. రావు రమేష్ ఉన్న ఫలంగా ప్రాజెక్ట్ నుండి డ్రాపవడంతో  ఇప్పుడు సునీల్ పాత్ర లేచిపోయింది. ఇలా అనుకున్న పాత్రలు లేపుకుంటు పోతే సినిమాలో అనుకున్నంతగా సీన్స్ పండుతాయా..! అన్నది ఇపూడు పెద్ద సందేహం. అంతేకాదు మిగతా సినిమా కంప్లీట్ అయ్యోసరికి ఇంకా ఎన్ని పాత్రలు తీసేస్తారో అన్న టాక్ కూడా బలంగా వినిపిస్తుమంది.


మరింత సమాచారం తెలుసుకోండి: