బిగ్ బాస్ 3 వివాదాల కోసమే ఈ షో ప్రారంభమైనట్టుంది. షో ప్రారంభం కాకముందు నుంచి లైంగిక ఆరోపణలు అంటూ శ్వేతా రెడ్డి చేసిన వివాదం, షో ఆపేయాలంటూ ఓయూ స్టూడెంట్స్ చేసిన నిరసనలను పక్కన పెట్టి నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ షో ప్రారంబమైంది. హోస్ట్ గా నిర్వహిస్తున్న నాగార్జున షో మొదల పెట్టగానే చెప్పే పదాలు 'వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో' అని. 


ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఆపేస్తే బాగుంటుంది అని అంటున్నారు నెటిజన్లు. షో ప్రారంభం నుంచి వివాదాలే. మొదటి వారంలో హేమ అక్క డామినేషన్ తట్టుకోలేక కాంటస్టెంట్స్ తో సహా ప్రేక్షకులు కూడా ఆమెని చూడలేక బయటకు తీసుకొచ్చేసారు. ఈ హేమ అక్క ప్లేస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీలో తమన్నా సింహాద్రి హౌస్ లోకి అడుగు పెట్టింది. హేమ అక్క హౌస్ లో ఎలిమినేట్ అయినా ఆమె స్థానాన్ని భర్తీ చెయ్యడమే కాకా ఆమె ఎలా మాట్లాడేదో అంతకు మించి తమన్నా సింహాద్రి మాట్లాడుతుంది. 


రెండొవ వారం తమన్నా సింహాద్రి మాట్లాడిన మాటలు ఘోరతి ఘోరంగా ఉన్నాయి. ఆలీ పెట్టిన టాస్క్ ఆమెకు నచ్చకపోతే చెయ్యకుండా ఉండాలి కానీ బిగ్ బాస్ హౌస్ వేధికగా 'నీ అంతు చూస్తాను, నిన్ను ఎదగనీకుండా చేస్తాను, నువ్వు ఎంత చేసిన వేస్ట్' అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇవి చుసిన బిగ్ బాస్ ప్రేక్షకులు ఎలిమినేషన్ లోకి తొయ్యండి ఒక్కసారి మేము హౌస్ నుంచి తోసేస్తాం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 


అలానే ఈ వారం నామినేషన్స్ లిస్ట్ లోకి తొయ్యడానికి కాంటస్టెంట్లు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నామినేషన్ జోన్ వచ్చేసింది. ఆ నామినేషన్ కి సంబంధించి ఈరోజు ప్రోమోలు విడుదల చేశారు. మొదటి ప్రోమోలో పునర్నవి సెల్ఫ్ నామినేషన్ చేసుకోగా, రెండోవా ప్రోమోలో తమన్నా సింహాద్రిని నామినేషన్ లిస్ట్ లోకి తోసేందుకు రవి కృష్ణ ప్రయత్నిస్తే.. అలీని తిట్టినట్టే అమ్మనా బూతులు తిట్టింది. ఒకొక్కరికి చుక్కలు చూపిస్తా అంటూ వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇచ్చింది. మరి ఆమె ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్లిందా ? లేదా అనేది ఈరోజు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: