'బాహుబలి' రికార్డ్ ను బద్దలు కొట్టే సినిమా   'సాహో' మాత్రమేనని  ప్రభాస్ ఫ్యాన్స్  చెప్పుకొని సాంత్వన పొందటం తప్పితే,  వాస్తవ పరిస్థితులు మాత్రం  అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.   పేరుకి ఈ సినిమా  తెలుగు సినిమా అయినా... ఈ సినిమాకి సంబంధించి వచ్చిన పోస్టర్లలో గాని, పాటల్లో గాని  ఎక్కడా  తెలుగుకు సంబంధించిన ఆనవాళ్లు  కనిపించలేదు. కనీసం ప్రమోషన్స్  విషయంలో కూడా ఈ సినిమా యూనిట్ పూర్తిగా ప్లాన్ తో ఉన్నట్లు కనిపించడం లేదు.  అంతే కాకుండా ప్రభాస్ లుక్స్ విషయంలో కూడా సాహో బృందం పెద్దగా కేర్ తీసుకున్నట్టుగా అనిపించలేదు. అసలు సినిమాలో తెలుగు నేటివిటీకి ఎక్కడా ఉండేలా లేదేమోనని అనుమానం కలుగుతుంది.  అయినా ఇంత భారీ బడ్జెట్ పెట్టి తీస్తున్న సినిమాను ఒక తెలుగు సినిమాగా ఎందుకు తియ్యలేకపోతున్నారో.  ఈ సినిమాని ఇతర భాషల వారినే ఎందుకు ఎక్కువగా టార్గెట్ పెట్టుకొని తీస్తున్నారు.  ఈ మధ్యన విడుదల చేసిన పాటల్లో కూడా అంతే ఎక్కువగా బాలీవుడ్ ప్రజానీకంకు కనెక్ట్ అయ్యేలా ట్యూన్స్ ఉన్నాయి తప్ప తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా లేవు.  ఈ పాటల్లోని హీరోహీరోయిన్ల లిప్ సింక్ కూడా సాహిత్యానికి తగ్గట్టుగా కలవలేదు.  దీనికి ప్రధాన కారణం సుజిత్ కి  ఒక సినిమా తీసిన అనుభవం మాత్రమే ఉంది.  అదీ ఒక నాలుగు కోట్ల బడ్జెట్ సినిమా.  పైగా ఆ సినిమాలో  భారీ విజువల్స్,  అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ స్,  మైమరపించే విన్యాసాలు.. ఇవేవి లేవు. 


 కానీ  సాహోలో ఇవే ప్రధానం. ఇక్కడే తేడా కొట్టింది.  అయిన ముప్పై ఏళ్ళు కూడా లేని,  కేవలం ఒకే ఒక్క సినిమా తీసిన దర్శకుడ్ని నమ్మి..  సుమారు 250 కోట్లు  ఖర్చు పెట్టడం అంటే.. ఖచ్చితంగా ఇది తెలివైన పని అయితే కాదు.  నిజానికి  సాహో ఏభై కోట్లతో మొదలైంది. కానీ అంతలో బాహబలికి వచ్చిన వందల కోట్లును చూసి.. ప్రభాస్ మార్కెట్ కూడా ఇప్పుడు  వందల కోట్లు అనుకుని  లెక్కలు వేసి మరి  'సాహో' నిర్మాతలు బడ్జెట్ ను  ఏభై నుండి  రెండొందల ఏభై కోట్లకు పెంచేశారు.  మరి ఈ సినిమా విడుదల అయితే గాని.. ఈ సినిమా నిర్మాతల భవిష్యత్తు చెప్పలేం.  మొత్తానికి  దర్శకుడు అయితే అంచనాలు అందుకోలేకపోతున్నాడు. అయితే  జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్  సాహోకి  ప్రత్యేకంగా నిలవనుందట.  ఈ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: