గత ఏడాది టచ్ చేసి చూడు , నేలా టిక్కెట్టు . అమర్ అక్బర్ ఆంటొని ల రూపంలో మూడు డిజాస్టర్ లతో  షాక్ తిన్నాడు  మాస్ మహా రాజా రవితేజ.  ప్రస్తుతం ఆయనకు  ఓ  హిట్ అవసరం.  అందుకే ఈ సారి రెగ్యులర్ స్టోరీ తో కాకుండా డిఫరెంట్ స్టోరీ ని ఎంచుకున్నారు. అదే  డిస్కో రాజా.  ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్  వి ఐ ఆనంద్  తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ఢిల్లీ లో  షూటింగ్ ను జరుపుకుంటుంది. 


సైన్టిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న  ఈ చిత్రం1999 లో వచ్చిన 'బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్' అనే  ఇంగ్లీష్ సినిమా కాన్సెప్ట్  తో తెరకెక్కుతుందట. ఆ సినిమా చాలా హిలేరియస్ గా ఉండి థ్రిల్లింగ్ మూమెంట్స్ తో ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది.  ప్రస్తుతం  కోలీవుడ్ లో జయం రవి , కాజల్ జంటగా నటిస్తున్న కోమలి కూడా ఇదే కాన్సెప్ట్ తో వస్తుంది.  తాజాగా విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్  చూస్తుంటే సినిమా  హిలేరియస్ గా ఉండేలా వుంది.  ఒకవేళ     రవితేజ  డిస్కోరాజా కూడా  ఇదే కాన్సెప్ట్ తో వస్తే మాత్రం ఆయన కామెడీ టైమింగ్ తో సినిమా  ఓ రేంజ్ లో సక్సెస్  అవ్వడం ఖాయం. 



ఇక ఈ చిత్రంలో నాబా నటేష్ , పాయల్ రాజ్ పుత్ , తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. రవితేజ  ఫ్రెండ్ పాత్రలో  సునీల్ నటిస్తుండగా విలన్ గా  కోలీవుడ్  హీరో  బాబీ సింహ  కానీకనిపించనున్నాడు. ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్  బ్యానర్ ఫై  రవి తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా  ఈ చిత్రాన్ని  ప్రేక్షకులముందుకు  తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: