అనుపమ కన్నడ కస్తూరి. ఈ అమ్మడు తెలుగులో ప్రేమం తో ఇంట్రడ్యూస్ అయి తరువాత వరసగా మూవీస్ చేస్తూ వచ్చింది. అయితే ఆమెకు సరైన బ్రేక్ మాత్రం రావడంలేదు. శతమానం భవతి సూపర్ హిట్ అయినా అది ఫ్యామిలీ మూవీగానే రికార్డ్ అయింది. సో ఆక్కడ మైలేజ్ ఏమీ రాలేదు. ఆ తరువాత రాం తో చేసిన రెండు సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. ఇపుడు ఒకే టైంలో  అటు రాం ఇటు అనుపమ సినిమాలు రిలీజ్ అయి హిట్లు కొట్టాయి. ఇస్మార్ట్ శంకర్ తో రాం కరవు తీరిపోయింది. రాక్షసుడు మూవీ హిట్ అయింది. బెల్లంకొండ శ్రీనివాస్ కి పేరు వచ్చింది.


మరి ఆ మూవీలో హీరొయిన్ గా ఉన్న అనుపమకు మాత్రం క్రెడిట్ దక్కలేదు. ఆమెను పట్టించుకున్న వారు కూడా ఎవరూ లేరు. ఆ మూవీలో నిజానికి అనుపమ కొన్ని సీన్లలో బాగా నటనకు స్కోప్  ఉండడంతో పెర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చింది. కానీ ఆమెకు ఈ హిట్ ఏమైనా యూజ్ అవుతుందా అంటే చెప్పలేని స్థితి. నిజానికి అనుపమ చూడ చక్కగా  ఉంటుంది. తెలుగు అందం ఆమెలో కనిపిస్తుంది.


ఐనా చాన్సులు రావడం లేదు అంటే అది ఆమెలోని లోపమా లేక శాపమా అన్నది అర్ధం కావడంలేదంటున్నారు. రాం తో చేసిన ఓ మూవీలో అక్కడికీ గ్లామర్ షో చేసినా కూడా జనాల నుంచి రెస్పాన్స్ రాలేదు. ఇక రాక్షసుడు లో హోమ్లీగానే ఆమె కనిపించింది. దాంతో అనుపమ అంటే ఫ్యామిలీ బ్రాండ్ పడడంతో కూడా ఆమెకు ఆఫర్స్ తగ్గిపోయాయి అంటున్నారు.


అనుపమ ఈ మధ్యన రాక్షసుడు ప్రమోషన్లో భాగంగా తాను అన్ని రకాల పాత్రలు చేస్తానను అని తనకు తానుగా చెప్పుకుంది. ఈ అమ్మడు గ్లామర్ విషయంలోనూ మునుపటి లా కాకుండా పట్టు విడుపులు ప్రదర్శిస్తోంది. అయినా సరే మన యంగ్ హీరోలకు ఎక్కడా ఆనడమేదట. మరి అనుపమ బ్యాడ్ లక్ అనే చెప్పాలి. అన్నీ ఉండి కూడా అవకాశాలు రాకపోవడం నిజంగా అనుపమకు పెద్ద ట్రబులే.


మరింత సమాచారం తెలుసుకోండి: